HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Sc Orders Reforms In Beggars Homes Says Poverty Cannot Be Penalised

Beggars Homes: బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

వ్యక్తులకు వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సమాజంలో తిరిగి కలవడానికి ప్రోత్సహించాలి.

  • By Gopichand Published Date - 11:00 PM, Mon - 15 September 25
  • daily-hunt
Beggars Homes
Beggars Homes

Beggars Homes: దేశవ్యాప్తంగా ఉన్న బిచ్చగాళ్ల హోమ్‌లు (Beggars Homes) జైళ్ల కంటే దారుణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ హోమ్‌లను ప్రభుత్వాలు దాతృత్వ సంస్థలుగా నిర్వహిస్తున్న తీరును కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఇలాంటి హోమ్‌లు వ్యక్తులకు పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధి, సమాజంలో తిరిగి కలిసిపోయే కేంద్రాలుగా ఉండాలని స్పష్టం చేసింది. బెగ్గర్స్‌ హోమ్స్‌లో అధిక రద్దీ, అపరిశుభ్ర పరిస్థితులు, అనవసరమైన నిర్బంధం, వైద్య సదుపాయాలు నిరాకరించడం, మానసిక-శారీరక అవసరాలను నిర్లక్ష్యం చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు, జైలు లాంటి వాతావరణం వంటివి కేవలం విధానపరమైన వైఫల్యాలు మాత్రమే కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ఉల్లంఘనేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

నిరుపేదలకు కూడా దక్కని ప్రాథమిక హక్కులు

దేశవ్యాప్తంగా బిచ్చగాళ్ల హోమ్‌ల నిర్వహణను మెరుగుపరచాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం నిరుపేదలు, జైలు ఖైదీలకు లభించే ప్రాథమిక రాజ్యాంగ హక్కులు కూడా బిచ్చగాళ్లు కోల్పోతున్నారు. బెగ్గర్స్‌ హోమ్‌లు రాజ్యాంగబద్ధమైన ట్రస్ట్‌లుగా ఉండాలని, వీటి ద్వారా అత్యంత బలహీన వర్గాల వారికి అధిక రక్షణ, గౌరవం, ఆరోగ్యం, ఆశ్రయం, గోప్యత, మానవీయ ఓదార్పు వంటి హక్కులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోర్టు తెలిపింది.

Also Read: Curry Leaves: పరగడుపున కరివేపాకు తింటే కలిగే ప్రయోజనాలివే!

ముఖ్య సూచనలు- మార్గదర్శకాలు

సుప్రీంకోర్టు బెగ్గర్స్‌ హోమ్‌ల నిర్వహణ మెరుగుపరచడానికి కొన్ని కీలక సూచనలు చేసింది.

ఆరోగ్య పరీక్షలు: హోమ్‌లో ప్రవేశించిన 24 గంటలలోపు తప్పనిసరిగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలి.

ఆహారం: ఆహార ప్రమాణాలను ధృవీకరించడానికి అర్హత కలిగిన డైటీషియన్ ఉండాలి.

మౌలిక సదుపాయాల సమీక్ష: కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి భవనాలను సమీక్షించి, రద్దీ, అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించాలి.

వృత్తి శిక్షణ: వ్యక్తులకు వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సమాజంలో తిరిగి కలవడానికి ప్రోత్సహించాలి.

భద్రత- గోప్యత: మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు, గోప్యత, భద్రత, విద్య, కౌన్సిలింగ్ సేవలు అందించాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beggars Homes
  • Conditions
  • jails
  • national news
  • Supreme Court

Related News

PM Modi To Visit Manipur

PM Modi To Visit Manipur: రేపు మణిపూర్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ!

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మణిపూర్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది.

  • Donald Trump

    Donald Trump: న‌వంబ‌ర్‌లో భార‌త్‌కు డొనాల్డ్ ట్రంప్‌.. కార‌ణ‌మిదేనా?

  • Brs Mlas Disqualification

    BRS MLAs Disqualification : ఆ ఇద్దరు తప్ప మిగతా వాళ్లంతా బిఆర్ఎస్ వైపే

  • PM Modi To Visit Manipur

    PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

  • Sonia Gandhi

    Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!

Latest News

  • Beggars Homes: బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

  • CM Chandrababu: సెప్టెంబర్ 17న విశాఖకు సీఎం చంద్రబాబు!

  • Curry Leaves: పరగడుపున కరివేపాకు తింటే కలిగే ప్రయోజనాలివే!

  • Cash Withdrawals: గుడ్ న్యూస్‌.. యూపీఐ ద్వారా డ‌బ్బు విత్‌డ్రా..!

  • Panchmukhi Hanuman Ji: మంగ‌ళ‌వారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి పూజ చేయండిలా!

Trending News

    • Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!

    • Fine For Late: ఈరోజే లాస్ట్ డేట్‌.. మిస్ అయితే రూ. 5 వేలు ఫైన్‌!

    • Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా??

    • 8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభ‌వార్త‌.. ఏంటంటే?

    • Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవ‌రు అన‌ర్హులు??

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd