Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి అందించిన ఎస్‌బీఐ
- By Latha Suma Published Date - 05:40 PM, Thu - 21 March 24

Electoral Bonds: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎన్నికల కమిషన్(Election Commission)కు అందజేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీరియల్ నంబర్ల(Serial numbers)తో సహా ఈసీకి అప్పగించింది. సీరియల్ నంబర్లు బాండ్లను ఎన్‌క్యాష్ చేసిన పార్టీల వివరాలతో సరిపోల్చేందుకు సహాయపడనున్నది. త్వరలో ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పబ్లిక్‌గా అప్‌డేట్ చేయనున్నది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
కోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌లో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎస్‌బీఐ వెల్లడించింది. ఇంతకు ముందు ఎస్‌బీఐపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్ల డేటాను మార్చి 21లోగా అందజేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 15న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆల్ఫా న్యూమరిక్ నంబర్లతో సహా పూర్తి వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఎస్‌బీఐ అందించిన డేటాను వైబ్‌సైట్‌లో పబ్లిష్ చేయాలని ఈసీకి సూచించింది.
read also: Hyderabad: హైదరాబాద్ లో పార్కింగ్ కోసం మొబైల్ యాప్ సేవలు
ఆల్ఫా న్యూమరిక్, సీరియల్ నెంబర్స్ లేకపోవడంతో సుప్రీంకోర్టు బాండ్ల వివరాల వెల్లడిలో ‘సెలక్టివ్’ విధానాన్ని మానుకోవాలని.. ఈ నెల 21లోగా ఏ దాత, ఏ రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో ఎంత విరాళం ఇచ్చారనేది తెలియజేసే యునిక్ బాండ్ నంబర్లతో సహా ఈసీకి పూర్తి వివరాలు సమర్పించాల్సిందేనని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యునిక్ నంబర్లతో సహా అన్ని వివరాలు అందజేసినట్లుగా 21న సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని ఎస్‌బీఐ ఎండీని ఆదేశించింది. వివరాలు అందిన వెంటనే వివరాలను అప్‌డేట్ చేయాలని ఈసీకి సూచించింది.