SBI: ఖాతాదారులకు శుభవార్త
SBI BANK లో సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండి మీరు 18 నుండి 65 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉన్న వారైతే ఒక గొప్ప శుభవార్త.
- Author : CS Rao
Date : 21-10-2022 - 1:56 IST
Published By : Hashtagu Telugu Desk
SBI BANK లో సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండి మీరు 18 నుండి 65 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉన్న వారైతే ఒక గొప్ప శుభవార్త.అకౌంట్ ఓపెన్ చేసిన SBI బ్యాంక్ కు వెళ్లి Rs.1000/- జమ చేసి గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో చేరి Rs.20 లక్షల వ్యక్తి గత ప్రమాద బీమా పొందండి. అలాగే PMJJBY స్కీమ్ లో Rs.330/- చెల్లించి 2 లక్షల లైఫ్ కవరేజ్ పొందండి. ఇది సహజ మరణానికి కూడా వర్తిస్తుంది.
అలాగే మరో Rs.12/- లు చెల్లించి PMSBY స్కీం లో చేరండి వ్యక్తిగత ప్రమాద బీమా Rs.2 లక్షలు కావరేజ్ పొందండి. ఈ స్కీం లో శాశ్వత అంగవైకల్యం చెందితే Rs.1 లక్ష రూపాయల కావరేజ్ ఇవ్వబడును.
మొత్తం Rs.1342లు చెల్లించి Rs.24 లక్షల రూపాయల కవరేజ్ ఒక సంవత్సరకాలం వరకు పొందండి. తప్పక ఆటో రెన్యూవల్ మోడ్ ను ఎంచుకోండి. ఈ స్కీంల గురించి తెలుసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న SBI BANK ని సంప్రదించండి అధిక వివరాలు తెలుకొని అకౌంట్ లేని వారు వెంటనే యెనో అకౌంట్ ఓపెన్ చేయండి. ఇది వాట్స్ అప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న న్యూస్.