HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sanitation Worker As Deputy Mayor

Deputy Mayor: డిప్యూటీ మేయర్ గా పారిశుద్ధ్య కార్మికురాలు.. ఎక్కడంటే..?

బీహార్‌లో ఇటీవల రెండో విడత నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో గయా మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడ మేయర్‌గా గణేష్ పసవాన్ గెలుపొందారు. డిప్యూటీ మేయర్‌ (Deputy Mayor)గా చింతాదేవి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పారిశుధ్య కార్మికురాలు చింతాదేవి విజయం సాధించడం విశేషం.

  • Author : Gopichand Date : 01-01-2023 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy Mayor
Resizeimagesize (1280 X 720) (1) 11zon

బీహార్‌లో ఇటీవల రెండో విడత నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో గయా మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడ మేయర్‌గా గణేష్ పసవాన్ గెలుపొందారు. డిప్యూటీ మేయర్‌ (Deputy Mayor)గా చింతాదేవి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పారిశుధ్య కార్మికురాలు చింతాదేవి విజయం సాధించడం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ పదవికి చింతాదేవితోపాటు మరో 10 మంది పోటీపడ్డారు.

ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆమెకు రికార్డు స్థాయిలో 50,417 ఓట్లు వచ్చాయి. ఆమె తన సమీప అభ్యర్థిపై 16 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఈ పదవిని చేపట్టడం గయ చరిత్రలో ఇదే తొలిసారి. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. రిజర్వేషన్ కారణంగా ఆమెకు ఈసారి గయా డిప్యూటీ మేయర్ పదవి లభించింది. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు కార్మిక సంఘం, స్థానికుల మద్దతుతో ఆమె విజయం సాధించారు.

Also Read: Pakistan Flags In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పాక్ జెండాలు, బ్యానర్లు కలకలం

పలు రాజకీయ పార్టీలు కూడా ఆమెకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా మేయర్ గా గణేష్ పాసవాన్ మాట్లాడుతూ.. ప్రజలకు జ్ఞానోదయం కలిగించే ప్రాంతం గయ. అలాంటి ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుడిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుని ప్రపంచానికి సరికొత్త ఉదాహరణగా నిలిచాం. ఇది చారిత్రాత్మకం అని అన్నారు. అయితే గయా ఎన్నికల్లో సాధారణ వ్యక్తులు ఉన్నత పదవులకు ఎన్నికవడం ఇదే తొలిసారి కాదు. గతంలో 1996లో పేద వర్గానికి చెందిన భగవతీ దేవి గయా నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. రాళ్లు రువ్వుతూ జీవనం సాగించే ఆమెకు జనతాదళ్ లోక్ సభ టికెట్ ఇచ్చి.. ప్రజలు పార్లమెంటుకు పంపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • Deputy Mayor
  • gaya
  • Sanitation worker

Related News

    Latest News

    • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

    • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

    • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

    • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

    • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

    Trending News

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd