Manifesto : సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
- By Latha Suma Published Date - 04:52 PM, Wed - 10 April 24

Akhilesh Yadav : రానున్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)ను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) బుధవారం విడుదల చేశారు. 2025 నాటికి కుల గణన చేపడతామని, అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం కుల గణన చేపడతామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్మెంట్‌ను వర్తింపచేస్తామని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
Read Also:MLC Iqbal Joins TDP : టీడీపీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, మీడియా స్వేచ్ఛా హక్కు, సామాజిక న్యాయ హక్కు దేశ అభివృద్ధికి కీలకమని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచామని అఖిలేష్ తెలిపారు. కుల గణన లేకుండా సమ్మిళిత వృద్ధి సాధ్యం కాదని, దేశ అభివృద్ధికి కుల గణన దిక్సూచీ వంటిదని ఆయన పేర్కొన్నారు.