MLC Iqbal Joins TDP : టీడీపీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ
మాజీ ఐపీఎస్ అధికారి అయినా మహ్మద్ ఇక్బాల్.. గతంలో చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు
- By Sudheer Published Date - 04:50 PM, Wed - 10 April 24

ఏపీ(AP)లో ఎన్నికల సమయం రోజు రోజుకు దగ్గరపడుతుండడం తో రాజకీయ నేతల వలసలు అన్ని పార్టీలలో ఎక్కువుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ (YCP) నుండి ప్రతిపక్ష పార్టీలు జనసేన , టిడిపి(TDP)లోకి..ఇటు టీడీపీ , జనసేన నేతలు వైసీపీకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీలు మారగా..తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal Joins TDP) ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి, టీడీపీలోకి స్వాగతం పలికారు.
We’re now on WhatsApp. Click to Join.
మాజీ ఐపీఎస్ అధికారి అయినా మహ్మద్ ఇక్బాల్.. గతంలో చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. కొంతకాలం టీడీపీ కార్యక్రమాల్లో జోరుగా పనిచేసిన ఆయన.. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించగా, ఆయనకు నిరాశ తప్పలేదు. హిందూపురం అసెంబ్లీ ఇన్చార్జిగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ ను తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు. దీంతో వైసీపీ ఫై అసంతృప్తితో ఉన్న ఆయన ఈరోజు సొంతగూటికి వచ్చారు.
Read Also : Bapatla : మార్కులు వేయకపోతే.. చేతబడి చేయిస్తానంటూ బెదిరించిన విద్యార్థి