Rs 130 Crores Cocaine : రూ.130 కోట్ల కొకైన్ సీజ్.. తీరంలో డ్రగ్స్ కలకలం
గుజరాత్‌లో రూ.130 కోట్ల విలువైన 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
- By Pasha Published Date - 04:46 PM, Wed - 5 June 24

Rs 130 Crores Cocaine : రూ. 130 కోట్లు విలువైన 13 కొకైన్ ప్యాకెట్లు దొరికాయి. సముద్ర తీరంలో దాచిపెట్టిన ఈ ప్యాకెట్లు దొరకడం కలకలం క్రియేట్ చేసింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
గాంధీధామ్ పట్టణం.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం సమీపంలోని మితి రోహర్ గ్రామంలో ఉన్న సముద్ర తీరంలో కచ్-ఈస్ట్ డివిజన్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున రైడ్స్ చేశారు. దీంతో సముద్ర తీరం సమీపంలో దాచిపెట్టిన రూ. 130 కోట్లు విలువైన 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గత ఎనిమిది నెలల వ్యవధిలో ఈ ప్రాంతంలో పెద్దఎత్తున లభ్యమైన డ్రగ్స్ స్టాక్ ఇదేనని అంటున్నారు. ఈ రైడ్స్‌లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : Bed Bugs : బెడ్ బగ్స్ వేధిస్తున్నాయా ? ఇలా తరిమికొట్టండి
తాజాగా రైడ్స్‌లో దొరికిన ఒక్కో డ్రగ్స్ ప్యాకెట్‌లో దాదాపు కిలో గ్రాము బరువున్న కొకైన్ ఉంది. ఇలాంటివి మొత్తం 13 ప్యాకెట్లను (Rs 130 Crores Cocaine) పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏటీఎస్ ఎస్పీ సునీల్ జోషి వెల్లడించారు. గతేడాది సెప్టెంబరులో కూడా మితి రోహర్ గ్రామంలో రైడ్స్ చేయగా కొకైన్ దొరికింది. గతేడాది పోలీసులకు 80 కొకైన్ ప్యాకెట్లు దొరికాయి. వాటి విలువ దాదాపు రూ. 800 కోట్లు ఉంటుంది.