Jakkampudi Raja : ధనుంజయ్ రెడ్డి ఓ చెత్త అధికారి – జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు
ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి ఆయన్ని సీఎంల వ్యవహరించేవాడని రాజా మండిపడ్డారు. జగన్ కు ఏ విషయం చెప్పాలి అన్న, ఫైల్ ఇవ్వాలి అన్న ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడేలా వ్యవహరించేవాడనిసంచలన ఆరోపణలు చేశారు
- Author : Sudheer
Date : 05-06-2024 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ఎన్నికల్లో వైసీపీ (YCP) ఘోరపరాజయం మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. వై నాట్ 175 అంటూ వచ్చిన వైసీపీ..చివరకు 11 సీట్లతో సరిపెట్టుకొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. వైసీపీ ఓటమి చెందుతుందని ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు కానీ ఇంత ఘోరంగా ఓడిపోతాదని ఎవ్వరు ఊహించలేదు. ఈ ఓటమి పలువురు వైసీపీ నేతలు తమ స్పందనను తెలియజేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో రాజానగరంలో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja) మాట్లాడుతూ.. ఓటమి జీర్ణించుకోలేకపోతున్నానని, తనను ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని వాపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా తీసుకోలేకపోతున్నానని తెలిపారు. ఇదే క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసారు రాజా. తమ నాయకుడు జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు, చెత్త కోటరీ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అబద్ధం చెప్పకూడదు రాజకీయాలలో నిజాయితీగా ఉండాలనే జగన్ తీరులో నిజంగా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారేమో అంటూ రాజా వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి ఆయన్ని సీఎంల వ్యవహరించేవాడని రాజా మండిపడ్డారు. జగన్ కు ఏ విషయం చెప్పాలి అన్న, ఫైల్ ఇవ్వాలి అన్న ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడేలా వ్యవహరించేవాడనిసంచలన ఆరోపణలు చేశారు. ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలు లోపలికి వెళితే కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడడానికి తీరిక లేనట్టు వ్యవహరించేవాడని రాజా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను రేపు.. ఎల్లుండి అంటూ ఐదు సంవత్సరాల తరబడి ఆయన తిప్పించుకున్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం ధనుంజయ రెడ్డి కాళ్ల చుట్టూ తిరిగేవాళ్లం. ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డిగా నమ్మారు. సచివాలయంలో అధికారులు కూడా సరిగా స్పందించేవారు కాదంటూ రాజా పేర్కొన్నారు.
Read Also : NTR : ఏపీలో కూటమి విజయం పై జూ. ఎన్టీఆర్ రియాక్షన్..