Congress: రాబర్ట్ వాద్రా ఎంట్రీతో మారేది కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తా? లేక…?
- By hashtagu Published Date - 09:56 AM, Wed - 9 March 22
ఎగ్జి్ట్ పోల్స్ చూస్తే.. బీజేపీకి సంతోషంగా ఉంది. కానీ కాంగ్రెస్ కు మాత్రం గుండె దడ పెరుగుతోంది. ఉన్న పంజాబ్ పీఠం కూడా ఖాళీ చేయాల్సి వస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు అన్న కోణంలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినాయకత్వంపై విమర్శలు వస్తాయా అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పారు.
బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పడం లేదు. రాజకీయంగా ఇప్పటికే ఎంతో నష్టపోయింది. అందుకే ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది. అనారోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ యాక్టివ్ గా లేకపోయినా.. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు. కానీ వాళ్లు రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించరు. అందుకే కార్యకర్తల్లో కూడా అయోమయం నెలకొంది. ఇలాంటి సమయంలో రాబర్ట్ వాద్రా ఎంట్రీ అంటే.. అది పార్టీకి బూస్ట్ ఇస్తుందా లేక బూమరాంగ్ అవుతుందా?
బీజేపీ పై పోరాడాలంటే రాజకీయ ప్రవేశం తప్పదన్నది రాబర్ట్ వాద్రా ఆలోచన. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఇప్పటివరకు బిజినెస్ మ్యాన్ గా ఉన్న రాబర్ట్ వాద్రా.. సామాజిక సేవా కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటున్నా అది ఎంతవరకు లాభిస్తుందో చూడాలి. కాంగ్రెస్ మూడడుగులు వేస్తే.. బీజేపీ 30 అడుగులు ముందుకు వేస్తుంది. అంటే రాజకీయంగా, వ్యూహాత్మకంగా అంత వేగంగా, చురుకుగా పనిచేస్తుంది. అలాంటి పార్టీని ఢీకొట్టి, పడగొట్టి పవర్ లోకి రావాలంటే.. అంతకుమించి ఆలోచించాలి. పనిచేయాలి.
ఇప్పటికైతే రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీల వల్ల కానిది.. రాబర్ట్ వాద్రా వల్ల అవుతుందా అంటే అని చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
Related News
CM Revanth Reddy : ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటాం
నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.