HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Road Accident In Karnataka 3

Road Accident in Karnataka : కర్ణాటకలో ఘోర ప్రమాదం..ఏపీకి చెందిన 13 మంది మృతి

గొరంట్లకు చెందిన వీరంతా టాటా సుమోలో బాగేపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమోలో మొత్తం 14 మంది ఉండగా.. వారిలో 13 మంది చనిపోయారు

  • Author : Sudheer Date : 26-10-2023 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
13 Killed In Road Accident
13 Killed In Road Accident

రోడ్ ప్రమాదాలు (Road Accidents) ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంటి నుండి వెళ్లిన వ్యక్తి..తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఆ తీరుగా ఉంది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం మత్తులో వాహనాలు నడపడం ఇలా పలు కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా కర్ణాటక (Karnataka )లోని చిక్ బళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది మృతి చెందారు.

గొరంట్ల (Gorantla village)కు చెందిన వీరంతా టాటా సుమో (Tata Sumo)లో బాగేపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమోలో మొత్తం 14 మంది ఉండగా.. వారిలో 13 మంది (13 Killed) చనిపోయారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన చిక్ బళ్లాపూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్డుపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

ఈ ప్రమాదం ఫై ఏపీ సీఎం జగన్ (CM Jagan) స్పందించారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను ఎంతో క‌లచివేసిందంటూ ట్వీట్ చేశారు. మృతిచెందిన వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాల‌కు మ‌న ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా నిలుస్తుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న మ‌రో వ్య‌క్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామ‌ని ట్వీట్‌లో సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

Read Also : YCP ‘Samajika Sadhikara’ Bus Yatra : వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 13 Killed
  • ap
  • Bangalore-Hyderabad Highway
  • Gorantla village
  • road accident

Related News

Pandu Master Health Update

Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా

  • 'Dhee' Fame Pandu Master Involved in Horrific Road Accident

    Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం

Latest News

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

  • Sunny Leone: సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు.. రూ.2,400 కోట్ల భారీ స్కామ్

  • Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!

  • ACB Raids: ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌ నాయక్‌ పై ఏసీబీ సోదాలు

  • Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd