Election Results 2024 : కాసేపట్లో ప్రజా ‘తీర్పు’.. ఎన్డీయేనా ? ఇండియానా ?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ భారత్‌లో జరిగింది.
- By Pasha Published Date - 07:38 AM, Tue - 4 June 24

Election Results 2024 : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ భారత్‌లో జరిగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలకానున్నాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 11 గంటలకల్లా దేశ ప్రజలు ఇచ్చిన తీర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఈసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందా ? ఇండియా కూటమి గెలుస్తుందా ? అనే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన మొత్తం 8,360 మంది అభ్యర్థుల భవితవ్యం సైతం తేలిపోనుంది. ఏపీలోని 175, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాల ఫలితాలు సైతం మంగళవారమే వచ్చేస్తాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది ఓటువేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఓట్ల లెక్కింపు వివరాలివీ..
* ఓట్ల లెక్కింపు ఘట్టంలో భాగంగా తొలుత మంగళవారం ఉదయం 5.30 గంటలకే ఈవీఎంలు భద్రపర్చిన అన్ని స్ట్రాంగ్ రూమ్స్ తెరుస్తారు.
* ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు.
* తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటి కౌంటింగ్ మొదలుపెట్టిన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను లెక్కించడం మొదలుపెడతారు.
* అన్నిచోట్లా తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలనే ప్రకటిస్తారు.
* ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బయటికి రావడం మొదలవుతుంది.
* మధ్యాహ్నం 2 గంటల్లోగా మెజారిటీ ట్రెండ్ బయటికి వస్తుంది.
* రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు(Election Results 2024) బయటికి వస్తాయి.
Also Read :Section 144: నేడు తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కరీంనగర్‌లో 144 సెక్షన్ అమలు
రాష్ట్రాలవారీగా లోక్‌సభ సీట్లు
ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48), పశ్చిమ బెంగాల్ (42), బిహార్ (40), తమిళనాడు (39), మధ్యప్రదేశ్ (29), కర్ణాటక (28), గుజరాత్ (26), ఆంధ్రప్రదేశ్ (25), రాజస్థాన్ (25), ఒడిశా (21), తెలంగాణ (17), అసోం (14), హరియాణా (10), అరుణాచల్ ప్రదేశ్ (2), చండీగఢ్ (1), ఛత్తీస్‌గఢ్ (11), దాద్రానగర్ హవేలీ (1), దమన్ దీవ్ (1), ఢిల్లీ (7), గోవా (2), హిమాచల్ ప్రదేశ్ (4), జమ్మూకశ్మీర్ (6), జార్ఖండ్ (14), కేరళ (20), లక్షద్వీప్ (1), మణిపూర్ (2), మేఘాలయ (2), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), పంజాబ్ (13), సిక్కిం (1), త్రిపుర (2), ఉత్తరాఖండ్ (5), అండమాన్ నికోబార్ దీవులు (1).