Star Symbol On Currency Note : స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవి కావు..ఆర్‌బీఐ క్లారిటీ
Star Symbol On Currency Note : కరెన్సీ నోట్లపై ఉండే స్టార్ () సింబల్ పై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ తరహా నోట్లు నకిలీవి అంటూ పలువురు పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
- By Pasha Published Date - 08:09 AM, Fri - 28 July 23

Star Symbol On Currency Note : కరెన్సీ నోట్లపై ఉండే స్టార్ (*) సింబల్ పై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ తరహా నోట్లు నకిలీవి అంటూ పలువురు పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ టాపిక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టతనిచ్చింది. స్టార్ (*) సింబల్ ఉన్న నోట్లు నకిలీవి కావని, అవి కూడా ఆర్‌బీఐ జారీ చేసిన నోట్లేనని తేల్చి చెప్పింది. ఇతర నోట్లలానే అవి కూడా చెల్లుతాయని వెల్లడించింది. ఆర్‌బీఐ వివిధ రకాల నోట్లను జారీ చేస్తుంటుంది.
Also read : Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు
సాధారణంగా వాటిపై సీరియల్ నంబర్ ముద్రించి ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని నోట్లపై స్టార్ సింబల్ కూడా ముద్రించి ఉండడం(Star Symbol On Currency Note) గమనించిన కొందరు సోషల్ మీడియాలో దీనిపై చర్చ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈమేరకు క్లారిటీ ఇచ్చింది. ప్రిఫిక్స్, సీరియల్ నంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని తెలిపింది. స్టార్ సింబల్ గుర్తు అంటే.. దాన్ని రీప్లేస్ చేసిన, పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించానికి ఈ స్టార్ సింబల్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది.
Also read : Telangana: తెలంగాణాలో రెండేళ్లలో 34,495 మంది మహిళలు మిస్సింగ్: షర్మిల