Telangana: తెలంగాణాలో రెండేళ్లలో 34,495 మంది మహిళలు మిస్సింగ్: షర్మిల
రోజుకో అంశంపై సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా పోలీసింగ్ వ్యవస్థపై ఆరోపణలు చేశారు. తెలంగాణాలో మహిళలు మాయం అవుతున్నట్టు ఆమె తెలిపారు.
- Author : Praveen Aluthuru
Date : 28-07-2023 - 7:36 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: రోజుకో అంశంపై సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా మహిళల మిస్సింగ్ పై ఘాటుగా స్పందించారు. తెలంగాణాలో మహిళలు మాయం అవుతున్నట్టు ఆమె తెలిపారు. మహిళలు మాయం అవుతుంటే పోలీసులు కేసీఆర్ లెక్కనే నిద్రపోతున్నారంటూ విమర్శించింది. దొరపాలనలో ఆడబిడ్డలకు మాన ప్రాణాలకు రక్షణే లేదని ఫైర్ అయ్యారు. కంటికి కనపడకుండా పోతున్నా పట్టింపే లేదని ధ్వజమెత్తారు. బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్ లో మొద్దు నిద్ర పోతున్నడని ఆరోపించారు. రెండేళ్లలో 34,495 మంది మహిళలు, 8,066 మంది అమాయక బాలికలు కనిపించకుండా పోయారంటే.. కేసీఆర్ తలదించుకోవాలని అన్నారు .మహిళల భద్రతకు పెద్దపీట అని చెప్పుకున్నందుకు సిగ్గుపడాలి. ఆడవారి పట్ల వివక్ష చూపే మీ బందిపోట్ల పాలనలో కనీసం మిస్సింగ్ కేసులు నమోదైనా దర్యాప్తు శూన్యం.కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదని చెప్పారు వైఎస్ షర్మిల.
దేశంలోనే నం.1 అని చెప్పే పోలీసింగ్ వ్యవస్థ.. మహిళలు మాయం అవుతుంటే దొరకు ఊడిగం చేస్తోంది. పసిగట్టాల్సిన నిఘా వ్యవస్థ దొర లెక్కనే నిద్ర పోతుంది.ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో..1% కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదు. దొరకు ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా..వెంటనే మిస్సింగ్ కేసులపై దర్యాప్తు కమిటీ వేయాలని, తక్షణం తప్పిపోయిన మహిళలు,బాలికల ఆచూకీ కనిపెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: IND vs WI: మొదటి వన్డేలో భారత్ ఘన విజయం