Ratan Tata – Udyog Ratna : రతన్ టాటాకు ‘ఉద్యోగ రత్న’ అవార్డు
Ratan Tata - Udyog Ratna : టాటా గ్రూప్ అంటేనే నమ్మకానికి చిరునామా. అలాంటి టాటా గ్రూప్ రథ సారధి 85 ఏళ్ల రతన్ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యోగ రత్న’ అవార్డుతో సత్కరించింది.
- By Pasha Published Date - 03:35 PM, Sat - 19 August 23

Ratan Tata – Udyog Ratna : టాటా గ్రూప్ అంటేనే నమ్మకానికి చిరునామా. అలాంటి టాటా గ్రూప్ రథ సారధి 85 ఏళ్ల రతన్ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యోగ రత్న’ అవార్డుతో సత్కరించింది. పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకుగానూ ఆయనకు ఈ పురస్కారాన్ని(Ratan Tata – Udyog Ratna) ప్రదానం చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న టాటా నివాసానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ .. రతన్ టాటాను కలిసి ఈ పురస్కారాన్ని అందజేశారు. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేసి సన్మానించారు.
Also read : BJP Operation: బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. కమలంలోకి 22 మంది కీలక నేతలు
రతన్ టాటాకు ‘ఉద్యోగ రత్న’ పురస్కారం అందించడం ద్వారా ఆ అవార్డుకే మరింత గౌరవం పెరిగిందని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని 100కిపైగా దేశాల్లో టాటా గ్రూపు ఉక్కు నుంచి ఉప్పు దాకా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటోందని చెప్పారు.