Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు
Ramit Khattar joined Congress: మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది.
- Author : Latha Suma
Date : 19-09-2024 - 5:43 IST
Published By : Hashtagu Telugu Desk
Ramit Khattar joined Congress: హర్యానాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భరత్ భూషణ్ బన్నా సమక్షంలో రమిత్ ఖట్టర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. హర్యానా కాంగ్రెస్ యూత్ వింగ్ ఈ సమాచారాన్ని షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
श्री मनोहर लाल खट्टर जी के भतीजे श्री रमित खट्टर ने आज कांग्रेस की सदस्यता ग्रहण की।कांग्रेस पार्टी ने उनका गर्मजोशी से स्वागत किया।#इबकै_कांग्रेस#BreakingNews #ShriRamitKhattar #BreakingNews pic.twitter.com/svPVlPXuJA
— Haryana Youth Congress (@Haryana_YC) September 19, 2024
హర్యానాలో ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. రమిత్ ఖట్టర్ కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు రమిత్ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. 2020లో డివిజనల్ అటవీ అధికారిని కొట్టిన కేసులో రమిత్ ఖట్టర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అంతే కాకుండా.. ఈ కేసులో రమిత్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనను కొట్టినప్పుడు రమిత్ ఖట్టర్ కూడా ఉన్నారని అటవీ అధికారి ఆరోపించారు.