Ramen Deca : ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా రామెన్ దేకా ప్రమాణస్వీకారం
రామెన్ దేకా మార్చి 1, 1954న అస్సాంలో జన్మించాడు మరియు 1980 నుండి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు.
- By Latha Suma Published Date - 03:19 PM, Wed - 31 July 24

Ramen Deca : రామెన్ దేకా ఛత్తీస్‌గఢ్ గవర్నర్(Chhattisgarh Governor)గా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేశ్ సిన్హా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.రాయ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న హరిచందన్ విశ్వభూషణ్ పదవీకాలం ముగియడంతో కొత్త గవర్నర్‌గా దేకాను నియమించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా రామెన్ దేకా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితుడు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడాన్ని భవిష్యత్తులో తాను చూస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నడుమ తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పారు.
మరోవైపు మణిపూర్ గవర్నర్( Manipur Governor)గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య(Laxman Prasad Acharya) ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లోగల దర్బార్ హాల్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు మణిపూర్ గవర్నర్‌గా పనిచేసిన అనసూయ ఉయికే పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో నూతన గవర్నర్‌ను నియమించారు.
కాగా, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య మంగళవారం (జూలై 30న) అసోం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అసోం రాజధాని గువాహటిలోని శ్రీమంత శంకర్‌దేవ కళాక్షేత్రలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అసోం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పుడు మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అసోం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంగళవారం సాయంత్రం ఇంఫాల్‌కు చేరుకున్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఘన స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.