Rajasthan Shocker : అమానుషం.. భార్యను బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లిన రాక్షస భర్త
రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన బాగా మద్యం తాగాడు.
- Author : Pasha
Date : 13-08-2024 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
Rajasthan Shocker : రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన బాగా మద్యం తాగాడు. ఆ మత్తులో తన భార్యను బైక్‌కు కట్టేసుకొని తనను రోడ్డుపైకి లాక్కెళ్లాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లా నార్సింగపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పాంచౌడి పోలీసు స్టేషన్ పరిధిలో నెల క్రితం జరిగిన ఈ ఘోరం(Rajasthan Shocker) ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
స్థానికుల కథనం ప్రకారం.. మేఘవాల్ అనే వ్యక్తి తాగుబోతు. అతడు ఎప్పుడూ భార్యను కొట్టేవాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఆమెను అడ్డుకునేవాడు. నెలక్రితం ఒకరోజు మద్యం తాగొచ్చిన మేఘవాల్ భార్యను చితకబాదాడు. అనంతరం ఆమె కాళ్లను తాడుతో బిగించి.. తన బైక్‌కు కట్టుకున్నాడు. మద్యం మత్తులో బైక్ నడుపుతూ భార్యను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. దీంతో రోడ్డుకు గీరుకుపోయి ఆమె శరీరం రక్తసిక్తం అయింది. దీన్ని చూసిన గ్రామస్తులు ఆగ్రహానికి, తీవ్ర విస్మయానికి గురయ్యారు. స్థానికులంతా కలిసి వెళ్లి మేఘవాల్‌ను అడ్డుకొని.. బైక్‌కు కట్టేసి ఉన్న అతడి భార్యను విడిపించారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.మేఘవాల్ తన భార్యతో పైశాచికంగా ప్రవర్తిస్తున్న టైంలో.. అతడి బంధువులు ముగ్గురు అక్కడే ఉన్నట్లు తెలిసింది. అయినా వారు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణం. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న తన సోదరిని చూడడానికి వెళ్తాను అన్నందునకే ఆమెపై మేఘవాల్ దాడి చేశాడని గుర్తించారు.
Also Read :324 Jobs : హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో 324 జాబ్స్.. ఐటీఐ పాసైన వారికి ఛాన్స్
ఈ దారుణ ఘటనకు సంబంధించిన 40 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఇంతటి ఘోరంపై సదరు వ్యక్తి భార్య పోలీసులకు కంప్లయింట్ చేయకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.