Rahul Issue : విపక్షాల్లో రాహుల్ `సావర్కర్` ప్రకంపనలు
రాహుల్(Rahul Issue)వ్యాఖ్యలు విపక్షాల మధ్య అనైక్యతను పెంచుతున్నాయి.
- Author : CS Rao
Date : 27-03-2023 - 5:20 IST
Published By : Hashtagu Telugu Desk
`నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ` అంటూ రాహుల్(Rahul Issue) చేసిన వ్యాఖ్యలు విపక్షాల మధ్య అనైక్యతను పెంచుతున్నాయి. సావర్కర్ ను(Saverkar) అవమానిస్తూ మాట్లాడడాన్ని సహించలేమని సంజయ్ రౌత్ వెల్లడించారు. సావర్కర్ ప్రకటన మహారాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అంశంగా మారింది. విపక్ష కూటమిలోనే చీలిక తెచ్చేలా కనిపిస్తోంది. రాహుల్ ను టార్గెట్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ సావర్కర్ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
సావర్కర్ ప్రకటన మహారాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అంశం(Rahul Issue)
తొలుత ఉద్దవ్ థాక్రే మీడియా ముఖంగా రాహుల్ చేసిన సావర్కర్ ప్రకటనను ఖండించారు. ఆ తరువాత ఆయన గ్రూప్ కు చెందిన సంజయ్ రౌత్ కూడా తెరపైకి రావడం గమనార్హం. వీర్ సావర్కర్ అంటే మనకు, దేశానికి గౌరవం అంటూ కొనియాడారు. అండమాన్‌లో 14 ఏళ్లుగా శిక్ష అనుభవించడం అంత సులభం కాదు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని రాహుల్ ను హెచ్చరించారు. కాంగ్రెస్ తో తాము ఉన్నప్పటికీ వీర్ సావర్కర్ మా స్ఫూర్తి అంటూ సంజయ్ రౌత్ అన్నారు.
Also Read : Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?
వీర్ సావర్కర్ ప్రకటన మీద రాహుల్ ను హెచ్చరించడం కాదని, తమ స్టాండ్‌ని స్పష్టం చేశామని సంజయ్ అన్నారు. వీర్ సావర్కర్ అంటే రాష్ట్రానికి, మనకు మరియు దేశానికి గౌరవం ఎల్లప్పుడూ ఉంటుంది. దేశం కోసం వీర్ సావర్కర్ కాలా పానీ శిక్షను అంగీకరించి 14 ఏళ్ల పాటు జైలులో ఉన్న తీరు అంత తేలికైన విషయం కాదని గుర్తు చేశారు.
ప్రతిపక్ష కూటమిలో చీలిక వచ్చే అవకాశం
అంతకుముందు, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నాడు సావర్కర్‌ను తక్కువ చేయడం ప్రతిపక్ష కూటమిలో చీలికను సృష్టిస్తుందని హెచ్చరించారు. అతను హిందుత్వ సిద్ధాంతకర్త వీడి సావర్కర్‌ను ఆరాధిస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడిని అవమానించడం మానుకోవాలని కోరారు. రాహుల్ గాంధీ సావర్కర్ ప్రకటనను ఖండిస్తూనే ప్రతిపక్ష కూటమిలో చీలిక వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. శివసేన (యుబిటి) చీఫ్, వీర్ సావర్కర్ మా దేవుడు, అతని పట్ల అగౌరవాన్ని సహించేది లేదని అన్నారు.
Also Read : Rahul Gandhi: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా.. ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తాను కూడా మద్దతిచ్చానని, తన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు చెల్లుబాటు అవుతాయని, అయితే సావర్కర్‌ను ప్రశ్నించడం సరికాదని థాకరే అన్నారు.విశేషమేమిటంటే, రాహుల్ గాంధీ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పరు” అని అన్నారు. దేశ వ్యాప్తంగా విపక్షాల మద్ధతు లభిస్తోన్న వేళ రాముల్ చేసిన సావర్కర్ వ్యాఖ్యలు విపక్షాల మధ్య దుమారం రేపడం గమనార్హం.
Also Read : Rahul Supreme: రాహుల్ అనర్హతపై సుప్రీంలో పిటిషన్