HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rahul Gandhi Who Rejected The Appointment Of Cec

Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్‌గాంధీ

ప్ర‌ధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్ర‌క్రియ‌లో అమ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోపించారు. సీఈసీ నియ‌మాక ప్ర‌క్రియ‌పై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

  • Author : Latha Suma Date : 18-02-2025 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi who rejected the appointment of CEC
Rahul Gandhi who rejected the appointment of CEC

Rahul Gandhi : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను అర్ధరాత్రి నియమించడంపై తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను కేంద్ర స‌ర్కారు తుంగ‌లో తొక్కిన‌ట్లు ఆరోపించారు. సీఈసీ ఎంపిక ప్ర‌క్రియ‌లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉండాల‌ని, కానీ చీఫ్ జ‌స్టిస్ లేకుండానే హ‌డావుడిగా సీఈసీ పేరును ప్ర‌కటించిన‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు. ప్ర‌ధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్ర‌క్రియ‌లో అమ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోపించారు. సీఈసీ నియ‌మాక ప్ర‌క్రియ‌పై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

Read Also: YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్

సీజేఐను తొలగించడంపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు తన అసమ్మతిని తెలియజేసినట్లు చెప్పారు. ఇప్పుడేమో అర్ధరాత్రి కొత్త సీఈసీని ప్రకటించేశారు. దీంతో కోట్లాది మంది ఓటర్లకు తీవ్ర అనుమానాలు మొదలయ్యాయని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. 1949లో ఎన్నిక‌ల సంఘం ఏర్పాటు విష‌యంలో చేసిన వార్నింగ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌క్క‌న‌పెట్టింద‌న్నారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కాపాడ‌డం ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న బాధ్య‌త అని, ప్ర‌భుత్వం దీనికి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని రాహుల్ పేర్కొన్నారు.

ఇక ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం ప్రకటించింది. రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సోమవారం అర్ధరాత్రి జ్ఞానేష్ కుమార్ పేరును కేంద్రం ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించింది. కాగా, కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 19న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీపై నిర్ణయాన్ని వాయిదావేయాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ సూచించినట్లు సమాచారం.

Read Also: 200 Year Old Peoples: 200 ఏళ్లు దాటిన వారు 2వేల మందికిపైనే.. సంచలన ప్రకటన

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Election Commissioner
  • Gyanesh Kumar
  • pm modi
  • rahul gandhi
  • Supreme Court

Related News

Telangana Cm Revanth Reddy

CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

2016 నాటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు, రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ (Quash) తీర్పునిచ్చింది.

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

  • Pm Modi Inaugurates Bridge

    Brahmaputra River : బ్రహ్మపుత్ర నదిపై ఆరు లేన్ల బ్రిడ్జ్.. ఇంజినీరింగ్ మేధస్సు కు జై కొట్టాల్సిందే !!

  • PM Modi

    బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd