Rajiv Gandhi : రాజీవ్‌గాంధీ వర్ధంతి.. రాహుల్ ఎమోషనల్ ట్వీట్.. సోనియా, ఖర్గే, మోడీ నివాళులు
అసోం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కూడా రాజీవ్ గాంధీకి(Rajiv Gandhi) నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
- By Pasha Published Date - 11:09 AM, Wed - 21 May 25

Rajiv Gandhi : ఇవాళ మన దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 34వ వర్థంతి. ఈసందర్భంగా ఢిల్లీలోని వీర్‌భూమిలో ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోకసభా పక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. ‘‘నాన్నా.. నీ జ్ఞాపకాలు ప్రతి అడుగులో నాకు మార్గదర్శనం చేస్తాయి. నీ పూర్తి కాని కలలను సాకారం చేయడమే నా సంకల్పం, వాటిని నేను నెరవేరుస్తా’ అని పేర్కొంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. వీర్‌భూమిలో రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన వారిలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సచిన్ పైలట్ ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. అసోం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కూడా రాజీవ్ గాంధీకి(Rajiv Gandhi) నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
पापा, आपकी यादें हर कदम पर मेरा मार्गदर्शन करती हैं।
आपके अधूरे सपनों को साकार करना ही मेरा संकल्प है – और मैं इन्हें पूरा करके रहूंगा। pic.twitter.com/jwptCSo1TN
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2025
రాజీవ్ గాంధీని చూసి దేశం గర్విస్తోంది : ఖర్గే
ఇక రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఒక ట్వీట్ చేశారు. ‘‘రాజీవ్ గాంధీ భారతదేశం గర్వించే బిడ్డ. ఆయన లక్షలాది దేశ ప్రజల ఆశాజ్యోతి. 21వ శతాబ్దపు సవాళ్లు, అవకాశాల దిశగా భారతదేశాన్ని సంసిద్ధం చేయడంలో రాజీవ్ కీలక పాత్ర పోషించారు’’ అని ఖర్గే కొనియాడారు.
Also Read :Shehbaz Sharifs Ancestors: పాక్ ప్రధాని పూర్వీకులు కశ్మీరీ పండిట్లే.. అనంత్ నాగ్‌లో మూలాలు!
ప్రధాని మోడీ ట్వీట్
రాజీవ్‌గాంధీ వర్థంతి వేళ ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు రాజీవ్ గాంధీ వర్ధంతి. ఈసందర్భంగా మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జీకి నా నివాళులు అర్పిస్తున్నాను’’ అని తన ట్వీట్‌లో మోడీ పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు : అజిత్ పవార్
‘‘విద్య, యువశక్తి, సాంకేతికతతో నడిచే ఆధునిక, సాధికారత కలిగిన భారతదేశం కోసం రాజీవ్ గాంధీ పరితపించారు. ఆనాడు ఆయన కన్న కలలు ఇప్పుడు సాకారం అవుతున్నాయి. ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకున్న దార్శనికత.. నేటి కాల పరిస్థితులకు కూడా సరిపోలుతుంది’’ అని NCP (అజిత్ పవార్ వర్గం) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొనియాడారు.
దేశం కోసమే రాజీవ్ అమరులయ్యారు : మమతా బెనర్జీ
‘‘భారతదేశం కోసమే రాజీవ్ గాంధీ జీవించారు. దేశం కోసమే ఆయన అమరులు అయ్యారు. దేశం అభ్యున్నతి కోసం రాజీవ్ ఎంతో చేశారు’’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.