HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rahul Gandhi Hints Bharat Dojo Yatra Coming Soon

Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్‌గాంధీ

మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను ‘డోజో’ అని పిలుస్తారు.

  • Author : Pasha Date : 29-08-2024 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi Bharat Dojo Yatra

Bharat Dojo Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు.  త్వరలో భారత్ డోజో యాత్ర ఉంటుంది అంటూ ఆయన ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.  మార్షల్‌ ఆర్ట్స్‌ సెషన్లకు సంబంధించిన వీడియో క్లిప్స్ అందులో ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను ‘డోజో’ అని పిలుస్తారు. అందుకే తాను తదుపరిగా చేపట్టబోయే యాత్రకు ‘భారత్‌ డోజో యాత్ర’(Bharat Dojo Yatra) అని రాహుల్ గాంధీ పేరు పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు.  బహుశా ఈ యాత్ర ద్వారా మార్షల్ ఆర్ట్స్‌ కేంద్రాలలో శిక్షణపొందే యువతను రాహుల్ కలుస్తారేమో అని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్‌ గాంధీ రెండు విడతల్లో భారత్ జోడో యాత్రను నిర్వహించారు. తద్వారా  దేశంలోని చాలా రాష్ట్రాలను కనెక్ట్ చేశారు. ఎంతోమంది ప్రజలకు చేరువయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీలకు మంచి ఫలితాలు రావడానికి భారత్ జోడో యాత్ర కూడా దోహదం చేసిందనేది విస్పష్టం. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీ నెక్ట్స్ చేపట్టబోయే యాత్ర అనేది అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Also Read :Richest Indian : అంబానీని దాటేసిన అదానీ.. శ్రీమంతుల లిస్టులోకి షారుక్‌

రాహుల్‌గాంధీని మెచ్చుకున్న స్మృతీ ఇరానీ 

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్‌గాంధీని మెచ్చుకున్న రాజకీయ ప్రత్యర్ధుల జాబితాలో మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా చేరిపోయారు.  రాజకీయంగా రాహుల్‌ గాంధీ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.  తన గెలుపును రాహుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్నారని స్మృతీ ఇరానీ చెప్పారు. పార్లమెంటులోకి తెల్ల టీషర్ట్ వేసుకుని వెళ్లడం ద్వారా యువతకు రాహుల్  ఓ సందేశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఇతర రాజకీయ నాయకుల కంటే భిన్నంగా రాహుల్ గాంధీ ముందుకుపోతున్నారని తెలిపారు.

Also Read :Japan Marriages : పెళ్లి కాని యువతులకు గుడ్ న్యూస్.. జపాన్ సరికొత్త స్కీమ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Dojo Yatra
  • Bharat Jodo Yatra
  • congress
  • rahul gandhi

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

    Latest News

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd