HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Punjab Results Is This End Of The Road For Congress Party

Congress: కాంగ్రెస్ కథ ఇక కంచికే!

ఎవరూ ఊహించనిది జరిగితే.. అది అద్భుతం లేదంటే సంచలనం అని అంటారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు తప్పేలా కనిపించడం లేదు.

  • Author : Hashtag U Date : 10-03-2022 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Resort Politics In Goa
Congress Resort Politics In Goa

ఎవరూ ఊహించనిది జరిగితే.. అది అద్భుతం లేదంటే సంచలనం అని అంటారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు తప్పేలా కనిపించడం లేదు. కేజ్రీవాల్ నేతృత్వంలో పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(AAP).. చీపురు పట్టుకుని ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లోనూ పెనుమార్పులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. తాజాగా పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మనకు ఇదే విషయం స్ఫష్టంగా అర్దమవుతోంది. పంజాబ్‌ ఫలితాల్లో ఆప్‌ దూసుకుపోయింది. 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పంజాబ్‌ లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈ సారి పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దానికి కారణం ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పంజాబ్‌ ‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఇది సాధ్యమైంది. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు తమదేనన్న నమ్మకం ముందునుంచి అక్కడి ప్రజల్లో కేజ్రీవాల్ కల్పించారు. పంజాబ్ లోని అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలను కాదని ఆప్ నే అక్కడి ప్రజలు ఆదరిస్తారని చెప్పిన కేజ్రీ మాటలు నిజమైయ్యాయి. ప్రచార సమయంలోనూ… కేవలం ఆప్ గనుక ఎన్నికల్లో గెలిస్తే… ఏం చేస్తుంది అనేది చెప్పడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయింది. అక్కడి గత కాంగ్రెస్ ప్రభుత్వం, విపక్ష బీజేపీ పై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలోనూ… ఆప్ విజయం సాధించిందనే చెప్పాలి.

గతంలో గనుక చూస్తే…. హస్తిన(ఢిల్లీ)లో ఆప్ స్పల్ప మెజారిటీతో గట్టెక్కింది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తమ ఉమ్మడి ప్రత్యర్ధి అయిన ఆప్ ను దెబ్బతీశాయని పలు సందర్భాల్లో కేజ్రీ అండ్ టీమ్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దాని ప్రభావంతో కాంగ్రెస్ పూర్తిగా మటు మాయం కాగా.. బీజేపీ నామమాత్రంగా మారిపోయింది. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన చర్చ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పంజాబ్ లోనూ ఆప్ గెలవడంతో… అక్కడ కూడా రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీనే అనే సంకేతాలు కూడా దేశవ్యాప్తంగా వెళ్తున్నాయి. మరోవైపు ఈ రకంగా భారతీయ జనతా పార్టీకి చాలెంజ్ చేసే శక్తిగా కూడా ఆప్ ఎదుగుతుందని, ఖచ్చితంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీనే అని రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు.

ఒక రాష్ట్రంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీకి పదేళ్లు పడితే…. అదే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఆవిర్భవించి పదేళ్లు దాటకుండానే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు చూస్తే… కేంద్రంలోని మోదీ సర్కార్ తో పోరాడుతున్న టీఎంసీ, డీఎంకే, టీఆర్ఎస్, సమాజ్ వాదీ వంటి పార్టీలకు ప్రస్తుతం తమ రాష్ట్రాలు దాటితే బలం శూన్యం అనే చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి మాత్రం అలా కాదు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్… ఇప్పుడు పంజాబ్ లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకోబోతోంది. దీంతో ఆప్ చేతుల్లోకి రెండో రాష్ట్రం వచ్చేసిందని చెప్పాలి. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు అండగా నిలిచేందుకు వివిధ ప్రాంతీయ రాజకీయ పార్టీలు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చాపకింద నీరులా… ఆప్ విస్తరించుకుంటూ పోతుంటే… కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతూ వస్తోంది. దీంతో ఆప్ ఏమో తగ్గేదేలే అంటుంటే… కాంగ్రెస్ పరిస్థితి మాత్రం నావికుడు లేని పడవలా తయారైంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు కేజ్రీవాల్ మాత్రం నేషనల్ పాలిటిక్స్ లో హీరోగా నీరాజనాలు అందుకుంటున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP in Punjab
  • congress
  • Priyanka gandhi
  • rahul gandhi

Related News

Priyanka Be Given The Respo

Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

రిజర్వేషన్ల ప్రక్రియలో ఓబీసీ మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత (Quota within Quota) కల్పించాలని, ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా, చిత్తశుద్ధితో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచించారు

  • Telangana Government Good N

    Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Latest News

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఢిల్లీని ఓడించిన తమిళనాడు అంటూ స్టాలిన్ హర్షం

  • Delimitation Bill : కేంద్రానికి బిగ్ షాక్..డీలిమిటేషన్ బిల్లు వెనక్కి !

  • Liver Diseases : భారత్‌లో విజృభిస్తున్న కాలేయ వ్యాధులు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd