Cylinder Rates : సిలిండర్ ధర రూ.91.5 తగ్గింపు
జాతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1 నుంచి వాణిజ్యపరంగా 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ.91.5 తగ్గిస్తున్నట్టు తెలిపాయి.
- By CS Rao Published Date - 01:41 PM, Tue - 1 February 22

జాతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1 నుంచి వాణిజ్యపరంగా 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ.91.5 తగ్గిస్తున్నట్టు తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టడానికి నిమిషాల ముందు ఇది జరిగింది.ఫిబ్రవరి 1 నాటికి, ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1,907. కాగా, ఢిల్లీలో సబ్సిడీ లేని (14.2 కిలోలు) ఇండేన్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.899.50గా ఉంది. కోల్‌కతాలో దీని ధర రూ.926. 5 కిలోలు, 10 కిలోల కాంపోజిట్ లేదా 5 కిలోల కాంపోజిట్ బరువున్న ఇతర డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు వంట గ్యాస్ రేటు ప్రతి నెల సవరించబడుతుంది.డిసెంబర్ 1, 2021న, 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ. 100 పెంచి, ఢిల్లీలో రూ.2,101కి తీసుకువచ్చారు. 2012-13 తర్వాత వాణిజ్య సిలిండర్‌పై సిలిండర్‌కు దాదాపు రూ. 2,200 ధర పలికిన తర్వాత ఇది రెండవ అత్యధిక ధర తగ్గింపు గా ఉంది.
Related News

Gas Cylinder Price: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతంటే..?
కేంద్ర ప్రభుత్వం ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర(Gas Cylinder Price)ను ఈరోజు అంటే బుధవారం 30 ఆగస్టు 2023 నుండి రూ.400 తగ్గించింది. సామాన్యులకు LPG సిలిండర్ 200 రూపాయల చౌకగా లభిస్తుంది.