HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >President And Prime Minister Paid Tribute To Vajpayee

Centenary Celebrations : వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

ఎప్పుడు కూడా ఆయ‌న కాంగ్రెస్ ప‌ట్ల విస్మ‌యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేద‌న్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అట‌ల్‌జీని దేశ‌ద్రోహి అని ఆరోపించింద‌న్నారు.

  • Author : Latha Suma Date : 25-12-2024 - 10:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
President and Prime Minister paid tribute to Vajpayee
President and Prime Minister paid tribute to Vajpayee

Centenary Celebrations : నేడు భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్​పేయీ శత జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ను బుధవారం ఉదయం సందర్శించారు. ఈ క్రమంలో వాజ్​పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్​​పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వాజ్​పేయీ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో మోడీ ఓ ఆర్టిక‌ల్ రాశారు. అట‌ల్‌జీ త‌న పార్ల‌మెంట్ కాలంలో.. ఎక్కువ శాతం ప్ర‌తిప‌క్ష బెంచ్‌ల‌కే ప‌రిమిత‌మైన‌ట్లు చెప్పారు. ఎప్పుడు కూడా ఆయ‌న కాంగ్రెస్ ప‌ట్ల విస్మ‌యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేద‌న్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అట‌ల్‌జీని దేశ‌ద్రోహి అని ఆరోపించింద‌న్నారు. 21వ శ‌తాబ్ధం వైపు మ‌ళ్లించిన శిల్పి మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి అని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. భార‌త ఆర్థిక ప్ర‌గ‌తికి బాటలు వేసిన సంస్క‌ర్త అట‌ల్‌జీ అని తెలిపారు. ఆశ్రిత‌ప‌క్ష‌పాత ఆర్ధిక విధానాల‌కు ఆయ‌న చ‌ర‌మ‌గీతం పాడిన‌ట్లు చెప్పారు.

ఆయ‌న నాయ‌క‌త్వ నైపుణ్యం సుదీర్ఘ కాలం అనేక రంగాల‌పై ప్ర‌భావం చూపింద‌న్నారు. వాజ్‌పేయి అధికారంలో ఉన్న స‌మ‌యంలో.. ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, టెలికాం అండ్ క‌మ్యూనికేష‌న్స్ రంగాలు విశేష ప్ర‌గ‌తిని సాధించాయన్నారు. మాజీ ప్ర‌ధాని అట‌ల్‌.. ఓ రాజ‌నీత్జుడు అని, ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తున్నార‌న్నారు. 90 ద‌శ‌కంలో దేశంలో రాజ‌కీయ అనిశ్చితి నెల‌కొన్న‌ద‌ని, 9 ఏళ్ల‌లో నాలుగు సార్లు లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని, ఆ స‌మ‌యంలో వాజ్‌పేయి స్థిర‌మైన‌, ప్ర‌భావంత‌మైన ప‌రిపాల‌న అందించిన‌ట్లు చెప్పారు. సాధార‌ణ ప్ర‌జ‌ల పోరాటాన్ని వాజ్‌పేయి గుర్తించార‌న్నారు.

స‌ర్వ‌శిక్షా అభియాన్ ద్వారా ఆయ‌న ఆధునిక విద్య‌ను అందించే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు చేప‌ట్టి ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఎదుర్కొన్న తీరు వాజ్‌పేయి నాయ‌క‌త్వాన్ని చాటుతుంద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న‌, ఢిల్లీ మోట్రోకు కూడా వాజ్‌పేయి పెద్ద‌పీట వేసిన‌ట్లు తెలిపారు. గోల్డెన్ క్వాడ్రిలెట‌ర‌ల్ ప్రాజెక్టు కూడా ఆయ‌న కీర్తిని పెంచింద‌న్నారు.

Read Also: Christmas 2024: క్రిస్మస్ వేడుకలు ఎలా ప్రారంభమయ్యాయి..? ప్రాముఖ్యత ఏమిటి..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • atal bihari vajpayee
  • Centenary Celebrations
  • CM Chandrababu
  • pm modi
  • President Draupadi Murmu
  • Sadaiv Atal
  • tribute

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

  • Trump- PM Modi

    యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

  • PM Modi

    పశ్చిమ ఆసియాలో యుద్ధం.. ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!

Latest News

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd