PM Narendra Modi: జనవరి 12న బెళగావికి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్ణాటక పర్యటనకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువ దినోత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ (PM Narendra Modi) బెళగావికి వస్తున్నట్లు సమాచారం.
- Author : Gopichand
Date : 17-12-2022 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్ణాటక పర్యటనకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువ దినోత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ (PM Narendra Modi) బెళగావికి వస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 6 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యువజనోత్సవాల్లో పుస్తక మేళా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీఎంవో కూడా పర్యటనకు అంగీకరించినట్లు సమాచారం.
బెళగావికి జిల్లా స్టేడియంలో రెండు రోజుల జాతీయ యువజన సదస్సును ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీన బెళగావికి రానున్నారు. ప్రభుత్వం స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. తదనుగుణంగా భారతదేశం అనేక వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, కాన్ఫరెన్స్‌ల ద్వారా స్వామి వివేకానంద జన్మదినాన్ని జరుపుకుంటుంది.
జనవరి 12, 13 తేదీల్లో నెహ్రూనగర్‌లోని జిల్లా స్టేడియంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 6 వేల మందికి పైగా యువతీ, యువకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సదస్సులో భాగంగా నగరంలోని క్లబ్ రోడ్డులోని సీపీఈడీ మైదానం, సర్దార్ హైస్కూల్ మైదానంలో పుస్తక ప్రదర్శన జరగనుంది. నగరానికి వచ్చే ప్రతినిధులకు బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యువతీ యువకులు కూడా పాల్గొననున్నారు.
Also Read: Delhi Fire news: ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం