PM Modi Gifts : జో బైడెన్, జిల్ బైడెన్‌లకు ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్స్ ఇవే..
చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, ఫిలిగ్రీ వంటి పద్ధతుల్లో ఈ రైలు మోడల్‌ను(PM Modi Gifts) తయారు చేశారు.
- By Pasha Published Date - 11:58 AM, Sun - 22 September 24

PM Modi Gifts : క్వాడ్ దేశాల కూటమి సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికాలోని డెలావర్ రాష్ట్రానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలోని విల్మింగ్టన్ పట్టణమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలం. అక్కడికి వెళ్లిన మోడీ.. బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా బైడెన్‌కు మోడీ కొన్ని ప్రత్యేక బహుమతులను అందజేశారు. పురాతన వెండి రైలు మోడల్‌ను బైడెన్‌కు కానుకగా ఇచ్చారు. దీని ప్రధాన క్యారేజ్ వైపు ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉంది. ఇంజిన్ వైపు ఇండియన్ రైల్వేస్ అని ఇంగ్లీషు, హిందీ లిపిలో రాసి ఉంది. ఈ రైలు నమూనాను మహారాష్ట్రకు చెందిన హస్త కళాకారులు తయారు చేశారు. సిల్వర్‌తో తయారు చేసిన ఆ రైలు నమూనా అట్రాక్టివ్‌గా ఉంది. దీని తయారీకి 92.5 శాతం వెండిని వాడారు. చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, ఫిలిగ్రీ వంటి పద్ధతుల్లో ఈ రైలు మోడల్‌ను(PM Modi Gifts) తయారు చేశారు.
Also Read :Vijaya Dairy : విజయ డెయిరీ ఎందుకు నష్టాల్లో ఉంది ? తేల్చే పనిలో తెలంగాణ సర్కారు
అమెరికా ప్రథమ పౌరురాలు, జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు కూడా మోడీ ఓ ప్రత్యేక బహుమతిని అందజేశారు. పేపియర్ మాచే బాక్స్‌లో పష్మినా శాలువాలను కానుకగా అందించారు. నాణ్యతల కలిగిన పష్మీనా శాలువాను కశ్మీర్‌లో తయారు చేయించారు. తొలుత ఈ శాలువాల తయారీ లడఖ్‌లోని చాంగ్తాంగి ప్రాంతంలో మొదలైంది. మృదువైన ఫైబర్, ప్రత్యేక నూలుతో దీన్ని తయారు చేస్తారు. వివిధ మొక్కలు, ఖనిజాలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే పష్మీనా శాలువాల తయారీలో వాడుతారు. అందుకే వీటిని మన దేశ వారసత్వ వస్తువులుగా పరిగణిస్తారు. ఈ శాలువాలను పేపియర్ మాచే బాక్స్‌లలో ప్యాక్ చేస్తారు. శాలువాల సున్నితత్వం, నాణ్యత పాడవకుండా ప్యాకింగ్ ఉంటుంది. ఈ బాక్స్‌లను కూడా కాగితపు గుజ్జు, జిగురు, ఇతర సహజ పదార్థాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ పెట్టె ప్రత్యేకమైన కళాకృతితో విభిన్న డిజైన్లతో ఉంటుంది. ఈ బాక్సులను అలంకరణ వస్తువులుగా కూడా వాడుతుంటారు.