Rahul Gandhi : భారత్ నాశనంపై `కేస్ స్టడీ`
భారత ఆర్థిక వ్యవస్థను ఎనిమిదేళ్ల కాలంలో ఎలా నాశనం చేయాలో తెలియచేసే ఒక `కేస్ స్టడీ`లా మోడీ పాలన ఉందని కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.
- By CS Rao Published Date - 02:49 PM, Mon - 2 May 22

భారత ఆర్థిక వ్యవస్థను ఎనిమిదేళ్ల కాలంలో ఎలా నాశనం చేయాలో తెలియచేసే ఒక `కేస్ స్టడీ`లా మోడీ పాలన ఉందని కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. “ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ ను మోడీ నాశనం చేశారని ట్వీట్ లో పొందుపరిచారు. విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతోంది. విద్యుత్ సంక్షోభాన్ని భారత్ లో “కృత్రిమంగా సృష్టించారని కాంగ్రెస్ అభివర్ణించింది. “బొగ్గు నిర్వహణ లోపం కారణంగా ఏర్పడిన ఈ కృత్రిమ విద్యుత్ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని కోరింది.
Power Crisis
Jobs Crisis
Farmer Crisis
Inflation CrisisPM Modi’s 8-years of misgovernance is a case study on how to ruin what was once one of the world’s fastest growing economies.
— Rahul Gandhi (@RahulGandhi) May 2, 2022
ఈ వేసవిలో 24×7 విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నామంటూ కాంగ్రెస్ గౌరవ్ వల్లభ్ అన్నారు. ఉదయ్‌పూర్‌లో జరగనున్న మేథోమదనం సదస్సులో పార్టీ ఆర్థిక సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది. సెషన్‌కు సంబంధించిన ఎజెండాను రూపొందించడానికి పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ ప్రధాన దృష్టి భారత ఆర్థిక వ్యవస్థ, రైతుల సమస్యలపై ఉంది.
ద్రవ్యోల్బణం ప్రజలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. పెరుగుతున్న ఇంధనం, వంటనూనెల ధరలు గృహ బడ్జెట్‌ను అమాంతం పెంచింది. రోజువారీ వినియోగ వస్తువులకు పిండి ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యపై ఆ పార్టీ నిరసనలు తెలుపుతోంది.
Related News

PM Modi : 6G దిశగా భారత్ పరుగు
దశాబ్దం చివరి నాటికి అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే 6G టెలికాం నెట్‌వర్క్‌ని అందుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం భారతదేశంలో 3G మరియు 4G టెలికాం నెట్‌వర్క్‌లు ఉన్నాయి.