Modi Gold Statue: బంగారంతో మోడీ విగ్రహం.. ప్రధానికి ప్రేమతో!
స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం మోదీ (PM Modi) బంగారు ప్రతిమను తయారు చేశారు.
- Author : Balu J
Date : 20-01-2023 - 1:32 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పై ఉన్న అభిమానంతో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం.. మోదీ (PM Modi) బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం, దీనివెనుక ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషిని పురస్కరించుకుని.. 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని (Gold Statue) తయారు చేసినట్టు తెలిపారు. ఈ విగ్రహాన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశామన్నారు.
ఈ బంగారు విగ్రహాన్ని రూపొందించేందుకు 11 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని… దీనిని తయారు చేసేందుకు దాదాపు తమ బృందంలోని 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారని సందీప్‌జైన్ పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly elections) బీజేపీ గెలిచిన మరుక్షణం మోదీ ప్రతిమను తయారు చేసే పని ప్రారంభించినట్టు సందీప్ జైన్ చెప్పారు. త్వరలోనే ప్రధానిని (PM Modi) కలిసి దీనిని ఆయనకు బహూకరించనున్నట్టు వివరించారు.
Also Read: Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గరు సజీవ దహనం!