Mauritius : గత పర్యటన నాటి దృశ్యాలను షేర్ చేసిన ప్రధాని
ఈ దేశానికి వచ్చినప్పుడల్లా మినీ ఇండియాకు వచ్చినట్లే ఉంటుందని తొలి పర్యటన ఫొటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని ప్రధాని వెల్లడించారు. 1998లో గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మోడీ.. మారిషస్‌లోని మోకా ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
- By Latha Suma Published Date - 03:01 PM, Tue - 11 March 25

Mauritius : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మారిషస్ వెళ్లిన విషయం తెలిసిందే,ఇక ప్రధాని హోదాలో ఆయన రెండోసారి ఆ దేశం వెళ్లారు. అయితే ప్రధాని మోడీకి 27 ఏళ్ల క్రితమే మారిషస్‌తో అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ప్రధాని హోదాలో 17 ఏళ్లకు మళ్లీ ఆ దేశంలో పర్యటించారు. మళ్లీ గంగా తలావోను సందర్శించారు. 2015లో ఆ దేశ నేషనల్ డేలో ప్రధాని పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి పదేళ్లకు 57వ నేషనల్ డేకు చీఫ్‌గెస్ట్‌గా పాల్గొననున్నారు.
Read Also: Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసు.. ఉరిశిక్ష పడిన సుభాష్‌శర్మ వివరాలివీ
మారిషస్ హిందూ మహాసముద్రంలో మన కీలక భాగస్వామి మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండానికి ముఖద్వారం కూడా. చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా మనకు ఆ దేశంతో అనుబంధం ఉంది అని ఈ పర్యటనకు ముందు మోడీ అన్నారు. ఈ దేశానికి వచ్చినప్పుడల్లా మినీ ఇండియాకు వచ్చినట్లే ఉంటుందని తొలి పర్యటన ఫొటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని ప్రధాని వెల్లడించారు. 1998లో గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మోడీ.. మారిషస్‌లోని మోకా ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని మోడీ అప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శిగా అక్కడికి వెళ్లి.. శ్రీరాముడు తన జీవితంలో అనుసరించిన విలువలను వెల్లడించాడు. రామాయణం రెండు దేశాల సంబంధాల్లో ఎలా వారధిగా నిలుస్తుందో వివరించారు. అప్పుడు ఆయన పర్యటన అధికారిక సమావేశాలకే పరిమితం కాలేదు. ఆ దేశ భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రజల అలవాట్లను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అలాగే గంగా తలావో సరస్సును సందర్శించారు. భారత్ వెలుపల ఆ ప్రాంతంలో హిందూ సంప్రదాయాలను అనుసరిస్తోన్న తీరును వీక్షించారు. ఆ దేశ జాతిపితగా పేరుగాంచిన సర్ సివూసాగుర్ రామ్‌గులాంకు నివాళి అర్పించారు. కాగా, మారిషస్‌లో భారత సంతతి జనాభా అధిక సంఖ్యలో ఉండటం వల్ల అది మినీ ఇండియాగా పాపులరైంది.
Read Also: BRS : ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ఎల్సీ సమావేశం..నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం