అమెరికాలో హౌ ఢీ మోడీ..తాలిబన్ల టార్గెట్ గా వ్యూహాలు
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పయనం అయ్యారు. ఈసారి జరిగే కార్యక్రమాలు, దైపాక్షిక ఒప్పందాలు చాలా కీలకం కానున్నాయి. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల పరం కావడంతో ఆసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం మోడీ చేయనున్నారు.
- By Hashtag U Published Date - 03:12 PM, Wed - 22 September 21

మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పయనం అయ్యారు. ఈసారి జరిగే కార్యక్రమాలు, దైపాక్షిక ఒప్పందాలు చాలా కీలకం కానున్నాయి. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల పరం కావడంతో ఆసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం మోడీ చేయనున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం తాలిబన్లకు ఈసారి రావడం కీలక అంశం. వాళ్ల నుంచి వచ్చే స్పందనకు ధీటుగా మోడీ ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తికరమైన సన్నివేశం ఈ టూర్లో ఉండబోతుంది. తాలిబన్లకు పాకిస్తాన్ ఒక వైపు ఇంకో వైపు చైనా మద్దతు ఇస్తున్నాయి. ఆ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా మోడీ ఏ విధంగా ప్రజెంట్ చేస్తారోనని ఆస్తక్తిగా ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. చైనా ఆర్థికంగా కుప్పకూలే ప్రమాదం సమీప భవిష్యత్ లో నే ఉంది. ఆ దేశపు అతి పెద్ద కంపెనీ ఆర్థికంగా నష్టపోవడంతో దాని ప్రభావం ఆ దేశంపై బాగు ఉండే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో ప్రధానంగా ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కీలక ఒప్పందాలను భారత ప్రభుత్వం చేసుకోనుంది. క్యాడ్ సమావేశం ముగిసిన మరుసటి రోజే ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశం ఉంది. దానితో మోడీ ప్రసంగించనున్నారు. ఆ వేదికగా తాలిబన్లను మోడీ హెచ్చరించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో చైనా, పాకిస్తాన్ కు పరోక్షంగా బలమైన వార్నింగ్ ఇవ్వడానికి మోడీ సిద్ధపడతారని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత తొలిసారిగా మోడీ ఆదేశ పర్యటన చేస్తున్నారు. వాస్తవంగా అమెరికా ఎన్నికల ముందు హవుడూ మోడీ అంటూ పెద్ద సభను నిర్వహించారు. రిపబ్లికన్ల అభ్యర్థి అయిన ట్రంప్ కు బాహాటకంగా మోడీ మద్ధతు ఇచ్చాడు. ప్రస్తుతం డెమొక్రాట్లు నుంచి అమెరికా అధ్యక్షుడుగా బైడెన్ ఉన్నారు. వర్చువల్ సమావేశాల్లో ఇప్పటి మూడుసార్లు మోడీ, బైడెన్ పాల్గొన్నారు.
ఏడాదిన్నర తరువాత మోడీ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే ప్రధమం. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన క్రమంలో ఏడాదిన్నర కాలంగా మోడీ దేశంలోనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం నుంచి బయట పర్యటించడం మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటనకు మోడీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటన విజయవంతం కావడానికి రాయబారులు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఇవి ఏ మేరకు ఫలప్రదం అవుతాయో చూడాలి.
Related News

KCR vs Modi: మోడీ నుంచి తప్పించుకుంటున్న కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణాలో పర్యటిస్తున్నారు. మహబూబ్ నగర్ లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ఇతర పనులను ప్రారంభించనున్నారు.