PM Modi: కాంగ్రెస్ లేకపోతే దేశంలో ఎమర్జెన్సీ ఉండేది కాదు!
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ఈ రోజు రాజ్యసభలో ప్రసంగించారు.
- By Balu J Published Date - 03:24 PM, Tue - 8 February 22

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ఈ రోజు రాజ్యసభలో ప్రసంగించారు. ఆజాదికా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశాన్ని అన్ని రంగాలలో మరింతగా ముందుకు తీసుకెళ్ళాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. కరోనా ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినప్పటికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశ ఆర్ధికవ్యవస్థ స్థిరంగా ఉందని, వృద్ధి కొనసాగుతుందని వెల్లడించారు.
దేశ ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచేందుకు అవసరమైన మౌలికసదుపాయాలను కల్పించామని, కోవిడ్ సమయంలో ఇప్పటి వరకు 23 సార్లు ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించడం జరిగిందన్న ప్రధాని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా ప్రజలను తప్పుదోవపట్టించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ప్రపంచదేశాలు కరోనాను భారత్ జయిస్తున్న తీరును ఆసక్తిగా గమనిస్తున్నాయన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తూ.. దేశ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తుందని మోదీ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయి.
ఒక కుటుంబ పార్టీగా కాంగ్రెస్ నేడు మిగిలిందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశంలో ఎమర్జెన్సీ ఉండేది కాదని… సిక్కుల ఊచకోతకూడ ఉండేది కాదని విరుచుకుపడ్డారు. మహాత్మగాంధీ సైతం కాంగ్రెస్ పార్టీని కావాలని కోరుకోలేదన్నారు. దేశ ప్రజల సౌభాగ్యం కోసం తమ ప్రభుత్వం రాష్ట్రాలతో కలసి పలు పథకాలు అమలు చేస్తుంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
यह देश एक था, श्रेष्ठ था।
यह देश एक है, श्रेष्ठ है और श्रेष्ठ रहेगा।
इसी विश्वास के साथ हम आगे बढ़ रहे हैं। pic.twitter.com/Ccx9EcmJn5
— Narendra Modi (@narendramodi) February 8, 2022