PM Modi : ఆ రెండు చెదపురుగులు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి..!!
అవినీతి, వారసత్వం...ఈ రెండు చెదపురుగులు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఆరెండింటిని అంతమొందిస్తే భారత్ ప్రజాస్వామ్య మనుగడకు సాధ్యమవుతుందన్నారు.
- By hashtagu Published Date - 10:44 AM, Mon - 15 August 22

అవినీతి, వారసత్వం…ఈ రెండు చెదపురుగులు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఆరెండింటిని అంతమొందిస్తే భారత్ ప్రజాస్వామ్య మనుగడకు సాధ్యమవుతుందన్నారు. అవినీతి,వారసత్వాలను జనజీవనం నుంచి పూర్తి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించినప్పుడే సామాన్యుల జీవితం మెరుగుపుడుతుందని ప్రధాని అన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అవినీతిపై భారీ ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో…అవినీతిపరులను క్షమిస్తే దేశ భివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రజలు అవినీతిపరులపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. దేశంలో వారసత్వంపై మాట్లాడితే రాజకీయ భావనగా విమర్శిస్తున్నారని మోదీ ఈ సందర్భంగా అన్నారు. దీని వల్ల ప్రజస్వామ్యానికి విఘాతం వాటిల్లుతోందన్నారు. వారసత్వ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు సహకరించాలని మోదీ కోరారు.