PM Modi, Rahul Gandhi: పార్లమెంటులో ప్రధాని మోదీ రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్..
ఈ పార్లమెంటులో ఓ సంఘటన అందర్నీ ఆకర్షించింది.ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలు ఆప్యాయంగా కలుసుకున్నారు. ఓం బిర్లాను అభినందించేందుకు ప్రధాని మోదీ ఆయన సీటు వద్దకు వెళ్లారు. అనంతరం రాహుల్ గాంధీ కూడా స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లారు
- Author : Praveen Aluthuru
Date : 26-06-2024 - 2:10 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi, Rahul Gandhi: 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్ అయ్యారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ తన పేరును ప్రతిపాదించారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఓం బిర్లాను తన స్థానంలో కూర్చోబెట్టారు. ప్రధాని మోదీ కూడా ఓం బిర్లాకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్, మోదీ ఆప్యాయంగా కలిశారు.
Video: PM Modi, Rahul Gandhi
ఈ పార్లమెంటులో ఓ సంఘటన అందర్నీ ఆకర్షించింది.ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలు ఆప్యాయంగా కలుసుకున్నారు. ఓం బిర్లాను అభినందించేందుకు ప్రధాని మోదీ ఆయన సీటు వద్దకు వెళ్లారు. అనంతరం రాహుల్ గాంధీ కూడా స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ, రాహుల్‌లు ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు. స్పీకర్‌ను తన సీటు వద్దకు తీసుకెళ్లేందుకు ప్రధాని రాహుల్‌ను కూడా పిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: Farmer Suicide Attempt : శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం