PM Modi Visit Adampur Air Base : ఎయిర్‌బేస్ వేదికగా పాక్, చైనాల పరువు తీసిన ప్రధాని మోడీ
PM Modi Visit Adampur Air Base : ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్, చైనా జరుపుతున్న ఫేక్ ప్రచారాన్ని మౌనంగా తిప్పికొట్టారు
- By Sudheer Published Date - 05:17 PM, Tue - 13 May 25

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హఠాత్తుగా పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్(Adampur Air Base )ను సందర్శించి, దేశ రక్షణకు అంకితమైన భారత వైమానిక దళాన్ని అభినందించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (operation sindoor) విజయవంతంగా సాగిన నేపథ్యంలో ఈ పర్యటన కీలకంగా మారింది. ఈ సందర్భంగా మోదీ, ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్, చైనా జరుపుతున్న ఫేక్ ప్రచారాన్ని మౌనంగా తిప్పికొట్టారు. ఆయన ప్రసంగించిన సమయంలో ఎస్-400 వ్యవస్థ స్పష్టంగా పక్కన కనిపించడంతో, అవన్నీ తప్పుడు వాదనలేనని ప్రపంచానికి చాటిచెప్పినట్టయ్యింది.
Modi’s Biggest Warning : భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమే..పాక్ కు మోడీ వార్నింగ్
పాకిస్థాన్-చైనా కలిసి భారత్‌పై దుష్ప్రచారం సాగించేందుకు ప్రయత్నించాయి. జేఎఫ్-17 యుద్ధవిమానాల ద్వారా చైనా మిస్సైళ్లను ప్రయోగించి ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశామని పాక్ గొప్పగా చెబుతుండగా, చైనీస్ మీడియా కూడా అందుకు మద్దతుగా వ్యవహరించింది. అయితే మోదీ పర్యటనతో ఈ ప్రచారానికి చెక్ పడింది. ఎస్-400 వ్యవస్థ అక్కడే ఉండడమే కాదు, భారత్ రఫెల్ యుద్ధవిమానాలతో ప్రతిస్పందన ఇచ్చిందని అంతటా చర్చ సాగుతోంది. శత్రు దేశాల బెదిరింపులకు భారత్ భయపడదని, దేశ రక్షణ కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉందని మోడీ హెచ్చరించారు.
Flaxseed Benefits: ప్రతిరోజు అవిసె గింజలు తింటే ఆ వ్యాధి నయమవుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తామే గెలిచామని చెప్పుకోవడం, వాస్తవానికి వ్యతిరేకంగా ఉంది. భారత సైన్యం జరిపిన దాడులతో పాక్ ఎయిర్‌బేస్‌లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కానీ పాక్ మాత్రం ఓటమిని అంగీకరించకుండా రాజకీయ దుష్ప్రచారంలో మునిగిపోయింది. మరోవైపు భారత్ రష్యా నుంచి మరిన్ని ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. ఇది పాక్, చైనా, టర్కీ వంటి దేశాలకు మరో గట్టి షాక్‌గా మారబోతోంది. ప్రధాని మోదీ ఆదంపూర్ పర్యటన ద్వారా దేశ సైనిక శక్తిని ప్రపంచానికి తెలియజెప్పడమే కాకుండా, సరిహద్దులపై భారత్ యొక్క దృఢ సంకల్పాన్ని మరోసారి ప్రదర్శించారు.