HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Flaxseeds A Superfood For Health And Diabetes Management

Flaxseed Benefits: ప్రతిరోజు అవిసె గింజలు తింటే ఆ వ్యాధి నయమవుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

అవిసె గింజలు రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలగడంతో పాటు ఎన్నో రకాల సమస్యలకు చెక్కు పెట్టవచ్చు అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 13-05-2025 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Flaxseed Benefits
Flaxseed Benefits

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని అనేక రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. ఈ అవిసె గింజలు మధుమేహం ఉన్నవారికి గొప్ప ఔషధం అని చెప్పాలి. ఈ గింజల్లోనే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందట. ఫైబర్ ఆహారంలోని చక్కర స్థాయిలను నెమ్మదిస్తుందని దీని కారణంగా రక్తం గ్లూకోస్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు అని చెబుతున్నారు.అయితే ప్రతీ రోజూ 10 గ్రాముల అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయట. ఈ గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని చెబుతున్నారు.

అలాగే అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం రూపంలో పుష్కలంగా ఉంటుందట. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందట. ఈ గింజలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని,రోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ద్రావణీయం కాని ఫైబర్ అధికంగా ఉంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుందట. ఈ ఫైబర్ ఆకలిని నియంత్రిస్తూ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుందట. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుందట.

అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి అవిసె గింజలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే అవిసె గింజల్లో లిగ్నాన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా అవిసె గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గాయాలు త్వరగా నయం అవుతాయట. అలాగే చర్మం కూడా సహజమైన గ్లోను పొందుతుందట. అయితే ఇంతకీ ఈ అవిసె గింజలు ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. రోజుకు 1 లేదా 2 టీ స్పూన్ల అవిసె గింజల పొడి తీసుకోవడం సురక్షితం ప్రయోజనకరం. మధుమేహ మందులు తీసుకునే వారు లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఈ గింజలను ఆహారంలో చేర్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Flaxseed
  • Flaxseed Benefits
  • health benefits
  • health tips

Related News

What are antioxidants? How do they work?

యాంటీఆక్సిడెంట్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఒకటి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని, కణాలను రక్షించే శక్తివంతమైన అణువులు.

  • Health

    మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పే 5 సంకేతాలీవే!

  • What are the benefits of tea tree oil for the skin?

    టీ ట్రీ ఆయిల్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?

  • Are you cleaning your ears with earbuds? These are the warnings from doctors..!

    ఇయర్‌బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

  • Chilblain

    చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే చిట్కాలు, పాటిస్తే అంతా క్లియర్

Latest News

  • మీరు డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపే ల‌క్ష‌ణాలివే!

  • బంగ్లాదేశ్ ఆట‌గాడిపై నిషేధం విధించిన బీసీసీఐ.. కార‌ణ‌మిదేనా?

  • పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ త‌ప్ప‌నిస‌రి!

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

  • అమెరికా రాజధానిలో భారీ పేలుళ్లు..

Trending News

    • ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd