Z Morh Tunnel : ‘జెడ్ -మోర్హ్’ సొరంగానికి మోడీ శ్రీకారం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
జెడ్ - మోర్హ్ టన్నెల్(Z Morh Tunnel) అనేది శ్రీనగర్‌ను లడఖ్‌తో అనుసంధానిస్తుంది.
- By Pasha Published Date - 01:26 PM, Mon - 13 January 25

Z Morh Tunnel : కశ్మీర్‌లో ‘జెడ్ – మోర్హ్’ సొరంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించారు. ఈసందర్భంగా ‘జెడ్ – మోర్హ్’ సొరంగం నిర్మాణ వివరాలను, మన దేశానికి అది ఎంత ముఖ్యమైందనే సమాచారాన్ని మనం తెలుసుకుందాం..
#WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg today.
CM Omar Abdullah and LG Manoj Sinha, Union Minister Nitin Gadkari are also present.
(Source: DD/ANI)#KashmirOnTheRise pic.twitter.com/GF7rwZaVn1
— ANI (@ANI) January 13, 2025
Also Read :Mahakumbh Day 1 : కొన్ని గంటల్లోనే 60 లక్షల మంది పుణ్యస్నానాలు.. మహా కుంభమేళాలో తొలిరోజు
జెడ్ – మోర్హ్ టన్నెల్.. టూరిజం, సైనికపరంగా ప్రయోజనాలివీ..
- జెడ్ – మోర్హ్ టన్నెల్(Z Morh Tunnel) అనేది శ్రీనగర్‌ను లడఖ్‌తో అనుసంధానిస్తుంది.
- శ్రీనగర్ టు లడఖ్, శ్రీనగర్ టు సోనామార్గ్ మార్గం అనేది ప్రతి సంవత్సరం చలికాలంలో హిమపాతం వల్ల మూసుకుపోతుంటుంది.
- ఇకపై ప్రతి సంవత్సరం చలికాలంలో హిమపాతం సంభవించినా.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. జెడ్ – మోర్హ్ టన్నెల్‌లో నుంచి లడఖ్, సోనామార్గ్‌లకు టూరిస్టులు, భారత సైన్యం సాఫీగా చేరుకోవచ్చు.
- చలికాలంలో కశ్మీర్‌లో టూరిజం కొనసాగడానికి ఈ టన్నెల్ దోహదం చేస్తుంది.
- జెడ్ – మోర్హ్ టన్నెల్ మీదుగా ప్రయాణించి శ్రీనగర్ – లడఖ్ హైవేపై ఉన్న సోనామార్గ్‌కు పర్యాటకులు చేరుకోవచ్చు.
- గండేర్బల్ జిల్లాలోని కాంగన్ పట్టణానికి సైతం ఈ టన్నెల్ ప్రధాన మార్గంగా మారనుంది.
- జెడ్ – మోర్హ్ సొరంగం భారత సైన్యానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైంది.
- ఈ టన్నెల్‌లో నుంచి తక్కువ టైంలోనే సోనామార్గ్, లడఖ్‌లకు భారత సైన్యం చేరుకోగలదు.
- లడఖ్‌కు సమీపంలోనే పాక్ ఆక్రమిత కశ్మీరులోని ప్రాంతాలు, చైనా-భారత్‌లకు చెందిన వాస్తవ నియంత్రణ రేఖలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఏవైనా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నా భారత సైన్యం సరిహద్దుల్లో వేగంగా మోహరింపు ప్రక్రియను పూర్తి చేయగలదు.
- జెడ్ – మోర్హ్ సొరంగంలో వాహనాలను గంటకు 80 కి.మీ వేగంతో నడపొచ్చు. ఈ అంశం మన సైనిక వాహనాల రాకపోకలకు పెద్ద అడ్వాంటేజీ.
- ఈ టన్నెల్‌లో నుంచి 1000 కార్లను ఒకేసారి తీసుకెళ్లొచ్చు. ఈ లెక్కన పెద్దపెద్ద సైనిక కాన్వాయ్‌లను ఏకకాలంలో లడఖ్ బార్డర్‌కు మనం పంపొచ్చు.
Also Read :Celebrities In Bhogi : భోగి వేడుకల్లో మోహన్ బాబు, మంచు విష్ణు, సాయికుమార్.. ఎన్టీఆర్, సాయి ధరంతేజ్ విషెస్
- ఈ సొరంగంలోని ప్రధాన టన్నెల్ 6.4 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంటుంది. దీని వెడల్పు 10 మీటర్లు. టూ వే ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొనేలా దీన్ని డిజైన్ చేశారు.
- జెడ్ – మోర్హ్ సొరంగం నిర్మాణానికి రూ.2,680 కోట్లు ఖర్చయ్యాయి. 12 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
- అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందుకు జెడ్ – మోర్హ్ సొరంగంలో ఒక ఎస్కేప్ టన్నెల్‌ను కూడా నిర్మించారు. అది 6.4 కి.మీ పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో ఉంది.