MODI Emotional: మోర్బీ ప్రమాదంపై మోదీ ఉద్వేగ ప్రసంగం.. నా జీవితంలో ఇలాంటి బాధను ఎదుర్కోలేదు..!!
- By hashtagu Published Date - 10:01 AM, Mon - 31 October 22

గుజరాత్‌లోని కెవాడియాలో సోమవారం జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోదీ నా జీవితంలో ఇంతటి విషాద ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు.
గుజరాత్‌లోని కెవాడియాలో.. నేను ఏక్తా నగర్‌లో ఉన్నప్పటికీ నా నా హృదయం మోర్బీ బాధితుల దగ్గర ఉందన్నారు. నా జీవితంలో నేను చాలా అరుదుగా అలాంటి బాధను అనుభవించాను. ఓ వైపు గుండె నిండా బాధ, మరోవైపు కర్తవ్యం. అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మోదీ అన్నారు. ఈ దుఃఖ సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉందన్నారు. గుజరాత్ ప్రభుత్వం నిన్నటి నుంచి సహాయ, సహాయక చర్యలను కొనసాగిస్తోందని తెలిపారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తోందని మోదీ స్పష్టం చేశారు.
I am in Ekta Nagar but my mind is with the victims of Morbi. Rarely in my life, would I have experienced such pain. On one hand, there is a pain-riddled heart and on the other hand, there is the path to duty: PM Narendra Modi in Kevadiya, Gujarat #MorbiTragedy pic.twitter.com/TcKkLIUwrK
— ANI (@ANI) October 31, 2022
Also Read: PK : ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..జగన్ కు సాయం చేయకుంటే బాగుండేది..!!
క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో కూడా పూర్తి నిఘా ఉంచామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గత రాత్రి మోర్బీకి చేరుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. నిన్నటి నుండి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్‌కి కమాండ్ చేస్తున్నారని మోదీ అన్నారు. ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసింది. రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్లలో ఎలాంటి అలసత్వం ఉండదని దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా అని అన్నారు మోదీ.