HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Petrol And Diesel Prices Rise Again 2

Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Petrol And Diesel Prices
Petrol And Diesel Prices

భారతదేశంలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్ని పెంచేశాయి. లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచగా వాహనదారులపై భారం మరింత పెరిగింది. గత 8 రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మూడోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ‌ పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. తాజా పెంపుతో పెట్రోల్‌పై లీటర్‌కు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.51కి చేరగా, డీజిల్ ధర రూ. 92.49కి చేరుకుంది.

గత 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప‌శ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడిచమురు ధరల భారాన్ని చమురు కంపెనీలు దశలవారీగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి.

ఇందులో భాగంగా మే 15న లీటరుకు ఏకంగా రూ. 3 పెంచగా, మే 19న మరో 90 పైసలు పెంచారు. తాజా పెంపుతో కలిపి ఈ 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ. 5 మేర పెరిగాయి.

ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ. 110.64, డీజిల్ రూ. 97.02గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 108.49, డీజిల్ రూ. 95.02కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 105.31, డీజిల్ ధర రూ. 96.98 వద్ద కొనసాగుతోంది.

ఇక‌, తాజా పెంపుతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 112.81కు చేర‌గా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 100.94కి పెరిగాయి.  విశాఖపట్నంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 113.53కు, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 101.27కి చేరాయి. వరుస పెంపులతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crude Oil Prices
  • fuel price hike
  • Oil Prices
  • Petrol Prices

Related News

Petrol and diesel prices rise again.

Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో.. దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా ఇటీవలే లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై ఏకంగా రూ.3 పెంచిన సంగతి తెలిసిందే. ఆ భారం మరువక ముందే ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగాయి. తాజా సవరణ ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటున లీటర్‌

  • Rupee value plummets sharply.

    INR vs USD: రూపాయి విలువ భారీగా పతనం..

Latest News

  • Rukmini Vasanth: బికినీలో డ్రాగన్ బ్యూటీ.. రుక్మిణి వసంత్

  • NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం

  • Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!

  • Donald Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం..

  • Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd