Sobhita Dhulipala : శోభిత బోల్డ్ సీన్లు చైతుకు బాగా నచ్చాయట..!!
Sobhita Dhulipala : ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్, ‘మేజర్’ సినిమాలు తనకు ఎంతో ఇష్టమని, అందులో ఆమె అద్భుతమైన నటన ప్రదర్శించిందని అన్నారు
- By Sudheer Published Date - 05:55 PM, Thu - 6 February 25

గత కొంతకాలంగా సరైన హిట్ లేని నాగ చైతన్య (Naga Chaitanya)..ప్రస్తుతం తండేల్ (Tandel ) మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ మ్యూజిక్ అందించాడు. ఫిబ్రవరి 07 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చైతు వరుస ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నారు. సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తున్నాడు.
Indian immigrants : అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తేమీ కాదు..!
తాజా ఇంటర్వ్యూలో చైతూ.. శోభిత (Sobhita Dhulipala) నటించిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి మాట్లాడారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్, ‘మేజర్’ సినిమాలు తనకు ఎంతో ఇష్టమని, అందులో ఆమె అద్భుతమైన నటన ప్రదర్శించిందని అన్నారు. ముఖ్యంగా ‘మేజర్’లో ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌లో శోభిత నటన చాలా సహజంగా ఉండడంతో పాటు కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆమె పెళ్లి తర్వాత ఆ సన్నివేశాలపై యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసినా, చైతూ మాత్రం అందులో ఆమె నటనను ప్రశంసించాడు. సమంతతో విడాకుల అనంతరం కొంతకాలం ఒంటరిగా ఉన్న చైతూ, తర్వాత శోభితతో స్నేహం పెంచుకున్నాడు. ఇది కాస్తా ప్రేమగా మారి, పెద్దల అనుమతితో గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.