Haryana CM: పెళ్లి కాని వారికి పెన్షన్.. హర్యానా సీఎం సంచలన నిర్ణయం
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 04:04 PM, Mon - 3 July 23

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్ అందిస్తామని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రాహుల్ తరహాలోనే హార్యానా సీఎం కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కాని వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయిస్తూ, 45-60 ఏళ్ల వయసున్న, పెళ్లి కాని వారు ఇందుకు అర్హులుగా గుర్తించనుంది.
ఈ మేరకు కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు. నెల రోజుల్లోగా ఈ పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. కర్నాల్‌లో జరిగిన జన్ సంవద్ కార్యక్రమంలో ఖట్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ 60 ఏళ్ల పెళ్లి కాని వ్యక్తి మాట్లాడుతూ.. పింఛను దరఖాస్తు విషయంలో తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీనికి సీఎం బదులిస్తూ..
‘‘45 ఏళ్లు పైబడిన వివాహం కాని మహిళలు, పురుషులకు నెలవారీ పింఛను ఇచ్చేలా కొత్త పథకం తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టాం.నెలరోజుల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ప్రస్తుతం సీఎం హామీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. యువతను ఆకట్టుకోవడం కోసమే ఆయన ఈ తరహా పథకం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారని పలువురు ఆరోపించారు.
Also Read: Poonam Kaur: పవన్ పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, ఫేక్ వాయిస్ వైరల్