Sonia Gandhi On Modi : మోడీ విదేశాంగ విధానంపై సోనియా ఫైర్
రష్యా , ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరిని పరోక్షంగా సోనియాగాంధీ తప్పుబట్టారు. దేశ విదేశాంగ విధానానికి అనైక్యత పునాదులను మోడీ సర్కార్ వేస్తోందని ఆరోపించారు. చరిత్రను దర్మార్గంగా వక్రీకరించే దిశగా బీజేపీ వెళుతోందని ఆందోళన చెందారు.
- By Hashtag U Published Date - 03:05 PM, Tue - 5 April 22

రష్యా , ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరిని పరోక్షంగా సోనియాగాంధీ తప్పుబట్టారు. దేశ విదేశాంగ విధానానికి అనైక్యత పునాదులను మోడీ సర్కార్ వేస్తోందని ఆరోపించారు. చరిత్రను దర్మార్గంగా వక్రీకరించే దిశగా బీజేపీ వెళుతోందని ఆందోళన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ అవసరమని అన్నారు. పార్టీకి అన్ని స్థాయిల్లోనూ ఐక్యత అవసరమని జీ 23 లీడర్లకు ఆమె చురకలంటించారు. ఐక్యతను పార్టీలో తీసుకురావడానికి తన వంత కృషి చేస్తామని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా వెల్లడించారు.కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నిర్వహించిన సమావేశంలో అన్ని స్థాయిలలో ఐక్యత” కోసం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణుల మధ్య ఐక్యతను నొక్కి చెప్పడం ద్వారా, సోనియా గాంధీ అసమ్మతివాదులకు, గాంధీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించే 23 మంది నేతలతో కూడిన G23 వాలకాన్ని సున్నితంగా మందిలించారు. కాంగ్రెస్పు నరుజ్జీవనంముఖ్యమైన అంశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం, సమాజానికి చాలా అవసరం అని సోనియా అన్నారు.
ఎన్నికల రాజకీయాలలో దుర్భరమైన పనితీరు, ఫిరాయింపులు, అంతర్గత పోరు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని సోనియా అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్ష గానూ, నాయకత్వంలోనూ గణనీయంగా తగ్గిపోయిందని అన్నప్పుడు సోనియా అంగీకరించారు. కాంగ్రెస్‌కు ముందున్న రహదారి గతంలో కంటే చాలా సవాలుగా ఉందని గుర్తు చేశారు. అధికార బీజేపీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూనే ఉందని సోనియా ఆరోపించారు. బెదిరింపులు, ఇతర వ్యూహాలు భయపెట్టవు నిశ్శబ్దం చేయలేవని అన్నారు.శతాబ్దాలుగా విభిన్న సమాజాన్ని సుస్థిరపరిచిన, సుసంపన్నం చేసిన స్నేహం, సామరస్య బంధాలను దెబ్బతీస్తోన్న బిజెపిని అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బిజెపి విభజన ఎజెండా క్రమం తప్పకుండా బయటపడుతుందని. పాలక పార్టీ “తన ఎజెండాకు ఆజ్యం పోసేందుకు చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించింది” అని ఆమె అన్నారు. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ హాజరయ్యారు.