No Confidence Motion: మోడీపై అవిశ్వాస తీర్మానంపై చర్చ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి
- Author : Praveen Aluthuru
Date : 25-07-2023 - 1:36 IST
Published By : Hashtagu Telugu Desk
No Confidence Motion: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. మణిపూర్ అల్లర్ల ఘటనపై స్పందించాల్సిందిగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీపై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం విపక్షాల సమావేశంలో నోటీసు అందజేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది.
మణిపూర్ ఘటనపై పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న విపక్షాల వ్యూహం రాజ్యసభలోనూ కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మణిపూర్ నుండి ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. మణిపూర్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతుండగా, మణిపూర్‌పై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, అయితే ప్రతిపక్షాలు చర్చకు అనుమతించడం లేదు. ఈ క్రమంలో సెషన్‌లో మూడు రోజులు గందరగోళం నెలకొంది.
Also Read: X Vs Meta Vs Microsoft : మూడు “X”లు ఢీకొంటాయా ? ట్విట్టర్ “X” లోగోకు చిక్కులు వస్తాయా ?