Diabetes : షాకింగ్ సర్వే…ఆ నగరంలో ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటిస్..!!
- Author : hashtagu
Date : 18-11-2022 - 6:47 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ లో మధుమేహగ్రస్తులు పెరిగిపోతున్నారు. మధుమేహం ప్రాణాంతకం కాదు కానీ జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలమీదకు వస్తుంది. దీనికి జన్యుపరమైన కారణాలతోపాటు జీవనశైలిలో మార్పులు , ఇతర కారణాలతో డయాబెటిస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అయితే డయాబెటిస్ పై నిర్వహించిన కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ముంబైలో నివసిస్తున్న ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటిస్ ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షణలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబై…ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలోని 6వేల మందిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను చెక్ చేవారు. అలవాట్లు, బ్లడ్ ప్రెజర్, శరీర కొలతలు, బరువు,కొలెస్ట్రాల్ వీటన్నింటి పరిగణీలోకి తీసుకున్నారు. వీరిలో 18మంది స్త్రీలు ఉండగా పురుషుల్లోనే రక్తలో గ్లూకోజ్ ఎక్కువగా ఉందని వెల్లడయ్యింది.
అయితే ముంబైలో డయాబెటిస్ కేసులు పెరగడంపై బీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో నిర్వహించిన అధ్యయనంలోనూ పురుషుల్లోనే డయాబెటిస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.తాజాగా నిర్వహించిన అధ్యయనంలోనూ అదే విషయం వెల్లడయ్యింది. మొత్తానికి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం. మంచిది. లేదంటే ప్రమాదంలో పడక తప్పదు.