UPI Down : మరోసారి యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్‌పీసీఐ
ఉదయం నుంచి గూగుల్ పే, ఫోన్‌పే సహా పేటీఎం వంటి ప్రముఖ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరగకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో వందలాది మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు.
- By Latha Suma Published Date - 04:02 PM, Sat - 12 April 25

UPI Down : మరోసారి దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గత నెల రోజుల వ్యవధిలో ఇలా అంతరాయం ఏర్పడటం ఇది మూడోసారి కావడంతో.. వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం నుంచి గూగుల్ పే, ఫోన్‌పే సహా పేటీఎం వంటి ప్రముఖ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరగకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో వందలాది మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మ ధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.
Read Also: Congress Govt : రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రబెల్లి సవాల్
ఈ విషయంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెంటనే స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా యూపీఐ లావాదేవీలు మధ్యమధ్యలో నిలిచిపోతున్నాయని మాకు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాము. మీకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తాము. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. యూపీఐ సేవల్లో అంతరాయాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 26న, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి.టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యూపీఐ సేవల్లో అంతరాయం జరిగినట్లు అప్పుడు ఎన్‌పీసీఐ వెల్లడించింది. కాగా ఇప్పుడు మరోమారు ఈ సమస్య తెరమీదకు వచ్చింది.
Read Also: kapilavai Dilip kumar : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా