CAA Implementation: సీఏఏపై మమతా బెనర్జీకి ఛాలెంజ్ విసిరిన అమిత్ షా
పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులకు మమతా ప్రభుత్వం ఓటరు గుర్తింపు కార్డులు ఇస్తోందని,
- By Praveen Aluthuru Published Date - 06:15 PM, Wed - 29 November 23

CAA Implementation: పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులకు మమతా ప్రభుత్వం ఓటరు గుర్తింపు కార్డులు ఇస్తోందని, అందుకే సీఏఏను వ్యతిరేకిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీని ఓడించాలని, బీజేపీకి ఓటేసి గెలిపించాలని షా కోరారు. 2026లో రాష్ట్రంలో మూడింట రెండొంతుల మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి పునాది వేస్తుందని అన్నారు. ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో పశ్చిమ బెంగాల్ ముందుండేదని చెప్పిన షా ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని విమర్శలు చేశారు. అందుకే వివాదాస్పదమైన సిఏఏని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల పోరాటం చేస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం ఎలాగైనా అమలు చేస్తామని చెప్తుంది. మరోవైపు ఎవరికైనా పౌరసత్వం పొందే హక్కు ఉందని అమిత్ షా అన్నారు.
Also Read: Single Ticket – 56 Days : ఒకే ఒక్క టికెట్‌తో 56 రోజుల ట్రైన్ జర్నీ