NHAI Offer : వాహనదారులకు NHAI బంపరాఫర్
NHAI Offer : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సౌకర్యం కోసం NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్తగా ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది
- By Sudheer Published Date - 09:00 AM, Tue - 14 October 25

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సౌకర్యం కోసం NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్తగా ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. చాలా టోల్ ప్లాజాల్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత సరిగా లేకపోవడంపై ప్రయాణికులు గతంలో పలు మార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రజల్లో బాధ్యతా భావం పెంచి, పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఫిర్యాదు చేసిన వారికి రివార్డు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31 వరకు అమల్లో ఉండే ఈ స్కీమ్ ప్రకారం, శుభ్రంగా లేని టాయిలెట్ ఫోటోను “రాజమార్గ్ యాత్ర” యాప్‌లో టైమ్ స్టాంప్‌తో అప్‌లోడ్ చేస్తే రూ.1,000 రివార్డు ఫాస్టాగ్ అకౌంట్‌లో జమ చేయబడుతుంది.
Health Tips: ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు అస్సలు తినకూడదట!
NHAI తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కీమ్ తమ ఆధ్వర్యంలో ఉన్న టాయిలెట్లకే వర్తిస్తుంది. అంటే, NHAI నేరుగా నిర్వహించే లేదా వారి నియమిత కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలోని టాయిలెట్లపైనే ఫిర్యాదులు పరిగణనలోకి తీసుకుంటారు. పౌరులు పంపిన ఫోటోలు, లొకేషన్ డేటా, టైమ్ స్టాంప్‌లను పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన ఫిర్యాదుదారులకు రివార్డు జమ అవుతుంది. దీని ద్వారా టోల్ ప్లాజాల్లో టాయిలెట్ల పరిశుభ్రత పట్ల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి, తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ స్కీమ్‌ను “స్వచ్ఛ భారత్ మిషన్” లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించింది. రహదారుల వెంట ప్రయాణించే కోట్ల మంది ప్రజలకు ఇది ఒక సానుకూల చర్యగా మారనుంది. ఒకవైపు వాహనదారులు పరిశుభ్రతపై బాధ్యత వహిస్తే, మరోవైపు టోల్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు తమ సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం వస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో రహదారుల పరిశుభ్రతను పెంచడం, పారదర్శకతను స్థాపించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఆఫర్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర హైవేలలో కూడా ఇలాంటి పథకాలు విస్తరించే అవకాశం ఉంది.