HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Nestle Adds 3 Gm Sugar In Every Serving Of Cerelac Sold In India

Nestle – Cerelac : పిల్లలకు సెరెలాక్ ఇస్తున్నారా ? అందులో చక్కెర మోతాదుపై సంచలన రిపోర్ట్

Nestle - Cerelac : మనదేశంలో నెస్లే కంపెనీ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు బేబీ ఫుడ్ బ్రాండ్‌‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉందని పబ్లిక్ ఐ పరిశోధనలో తేలింది.

  • Author : Pasha Date : 18-04-2024 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nestle Cerelac
Nestle Cerelac

Nestle – Cerelac : మనదేశంలో నెస్లే కంపెనీ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు బేబీ ఫుడ్ బ్రాండ్‌‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉందని పబ్లిక్ ఐ పరిశోధనలో తేలింది. ఇటువంటి ఉత్పత్తులు యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో చక్కెర రహితంగా ఉన్నాయని రీసెర్చ్‌లో వెల్లడైంది. నెస్లే కంపెనీ శిశువుల పాలు, తృణధాన్యాల ఉత్పత్తులకు చక్కెర, తేనెను జోడిస్తోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల  పిల్లల్లో  స్థూలకాయం, దీర్ఘకాలిక వ్యాధులను నివారించాలనే లక్ష్యంతో రూపొందించిన అంతర్జాతీయ మార్గదర్శకాల ఉల్లంఘన జరుగుతోందని తెలిపింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో విక్రయించే నెస్లే ఉత్పత్తుల్లో ఈ ఉల్లంఘనలను గుర్తించామని నివేదిక స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

భారతదేశంలో విక్రయించే మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రోడక్టులలో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు 3 గ్రాముల చక్కెర ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇథియోపియా, థాయ్‌లాండ్‌లలోనైతే ఈ తరహా ఉత్పత్తులలో చక్కెర మోతాదు మరీ అత్యధికంగా దాదాపు 6 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. జర్మనీ, బ్రిటన్‌లలో వీటిని చక్కెర లేకుండా విక్రయిస్తున్నారు. నెస్లే కంపెనీ మన దేశంలో  2022 సంవత్సరంలో దాదాపు రూ.20,000 కోట్లు విలువైన సెరెలాక్ ఉత్పత్తులను విక్రయించింది.

Also Read :Political Heirs : రాజకీయ వారసులతో ఎన్నికల ప్రయోగం.. ఏమవుతుందో ?

‘‘ఈ అధ్యయన నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెలుగుచూశాయి.  శిశువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారాలలో చక్కెరను జోడించడం సరికాదు. ఇది పిల్లలను చక్కెరకు అలవాటు చేస్తుంది. ఆరోగ్యానికి చేటు చేస్తుంది’’ అని బ్రెజిల్‌లోని పరైబా ఫెడరల్ యూనివర్సిటీ న్యూట్రిషన్ విభాగం ఎపిడెమియాలజిస్ట్ , ప్రొఫెసర్ రోడ్రిగో వియాన్నా తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లల ఆహారంలో చక్కెర అతిగా  ఉంటే వారిని ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ముసురుకునే అవకాశాలు పెరుగుతాయి.

Also Read :Election Notification: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల..!

దీనిపై నెస్లే ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మేం ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. శిశువులకు సంబంధించిన పోషకాహార ఉత్పత్తుల్లో జోడించే చక్కెర మోతాదును గత ఐదేళ్లలో 30 శాతం వరకు తగ్గించాం’’ అని స్పష్టం చేశారు.

Also Read : Indian Railways: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై ఒకే యాప్‌లో అన్ని ర‌కాల‌ రైల్వే సేవ‌లు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 gm Sugar
  • business
  • Cerelac
  • india
  • Nestle

Related News

Rupee

కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $116 మార్కును దాటడంతో భారత వాణిజ్య లోటు మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • 12 Tonnes Of Kitkats Stolen

    KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

  • Gas Effect 4yres

    War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

  • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd