HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Neet Ug 2024 City And Centre Wise Results Published By Nta As Per Supreme Court Direction

NEET UG 2024 : ఆ ఫార్మాట్‌లో ‘నీట్‌ -యూజీ’ రిజల్ట్స్ రిలీజ్.. ‘సుప్రీం’ ఆదేశం అమలు

సుప్రీంకోర్టు  ఆదేశాల‌ను నీట్-యూజీ పరీక్షల నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అమలు చేసింది.

  • By Pasha Published Date - 02:02 PM, Sat - 20 July 24
  • daily-hunt
Neet Ug 2024 Supreme Court

NEET UG 2024 : సుప్రీంకోర్టు  ఆదేశాల‌ను నీట్-యూజీ పరీక్షల నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అమలు చేసింది. దేశంలోని నగరాలు, ఎగ్జామ్ సెంటర్స్  వారీగా నీట్‌-యూజీ ఫలితాలను ఇవాళ విడుదల చేసింది.  అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందులో విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయలేదు.  ఈ వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌టీఏ అప్‌లోడ్ చేసింది. మిగతా పరీక్షా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో నీట్-యూజీ(NEET UG 2024) ఎగ్జామ్స్ రాసిన వారికి ఎంతమేర ఎక్కువ మార్కులు వచ్చాయనేది తెలుసుకోవడానికే ఈ జాబితాను సుప్రీంకోర్టు కోరింది. నీట్ యూజీ ఫ‌లితాల‌ను https://neet.ntaonline.in/frontend/web/common-scorecard/index లింక్‌లో అభ్యర్థులు చూడొచ్చు. తదుపరిగా ఈ జాబితాలోని సమాచారాన్ని సుప్రీంకోర్టు విశ్లేషించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై తదుపరిగా జులై 22న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించనుంది.

We’re now on WhatsApp. Click to Join

దేశంలోని 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్షను నిర్వహించారు. దీనికి 24 లక్షల మందికిపైగా హాజరయ్యారు. వీటిలోని 14 పరీక్షా కేంద్రాలు విదేశాల్లో కూడా ఉన్నాయి. నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు  జరిగాయంటూ సుప్రీంకోర్టులో దాదాపు 40కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని  ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని దేశ సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం విచారిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఇటీవల ఎన్టీఏను(NTA) సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. పూర్తిస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని బలమైన నిర్ధారణకు వస్తేనే మళ్లీ నీట్-యూజీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా స్పష్టం చేసింది.

Also Read :UPSC Chairman : యూపీఎస్సీ ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా.. కారణం అదేనా ?

ప్రస్తుతానికి దేశంలోని మహారాష్ట్ర, బిహార్, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన వ్యవహారం బయటపడింది. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలేవీ పెద్దగా వెలుగుచూడలేదు. ఈనేపథ్యంలో యావత్ దేశంలో నీట్-యూజీ పరీక్షను రద్దు చేసే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. అవసరమైతే ప్రశ్నపత్రాలు లీకైన కేంద్రాల పరిధిలోనే నీట్-యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించే దిశగా మొగ్గుచూపే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read :Punjab: ఆర్మీ వాహనాన్ని ఢీ కొట్టిన డీసీఎం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • centre wise results
  • City wise results
  • NEET UG 2024
  • NTA
  • Supreme Court

Related News

Supreme Court Dismissed The

Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Vote For Note Case : ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది

  • Jacqueline Fernandez

    Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మోసం కేసు.. స్టార్ హీరోయిన్‌కు సుప్రీంకోర్టులో షాక్‌!

  • Vijayawada Utsav Sh

    Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి

Latest News

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

  • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd