KPA : మణిపూర్ సర్కార్ కు మరో షాక్..
మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్‌ను ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు అధికార పక్షానికి దూరమవుతున్నట్లు ప్రకటిస్తూ
- By Sudheer Published Date - 10:37 AM, Mon - 7 August 23

మణిపూర్ (Manipur) రాష్ట్రంలో గత మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం ఫై యావత్ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ తరుణంలో మణిపూర్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది బీజేపీ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్(NDA partner Kuki People’s Alliance). ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ (KPA) ప్రకటించింది.
మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్‌ను ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు అధికార పక్షానికి దూరమవుతున్నట్లు ప్రకటిస్తూ కేపీఏ ఓ లేఖను మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికీకి పంపంచింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను కూలంకషంగా పరిశీలించిన తర్వాత బీరేన్ సింగ్ ప్రభుత్వానికి (Biren Singh Government) మద్దతు కొనసాగించడం సాధ్యం కాదని తమ పార్టీ నిర్ణయించిందని, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, వెంటనే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ రాసిన లేఖలో టాంగ్‌మాంగ్ తెలియజేశారు.
దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని విశ్లేషకులు అంటున్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ-ఎన్డీఏకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటె మణిపూర్ లో మాత్రం అల్లర్లు తగ్గడం లేదు. శనివారం తెల్లవారుజామున బిష్ణుపూర్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ముగ్గురు మరణించారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంగోల్ గ్రామంలో అల్లరిమూకలు 15 ఇళ్లకు నిప్పంటించాయి. అంతేకాకుండా 45 ఏళ్ల వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అతడి ఎడమతొడకు బుల్లెట్ గాయమైంది. ఆ వ్యక్తిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దాంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. మృతులను క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి (Meitei community) చెందినవారని పోలీసులు గుర్తించారు. కొందరు వ్యక్తులు బఫర్ జోన్‌ను దాటి మెయిటీలు ఉండే ప్రాంతాలకు వచ్చి వారిపై కాల్పులకు తెగబడ్డారని వారు తెలిపారు. ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో భద్రతా దళాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆ ప్రాంతం పూర్తిగా తమ అదుపులో ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.
Read Also : National Handlooms Day: చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్