Modi Millet :ఆరోగ్యకర ఆహారం మిల్లెట్స్:గ్లోబల్ సదస్సులో మోడీ
చిరు ధాన్యాల(Modi Millet) యుగం మళ్లీ వచ్చేస్తోంది. పండించే రైతులను(Farmers)
- By CS Rao Published Date - 04:57 PM, Sat - 18 March 23

చిరు ధాన్యాల(Modi Millet) యుగం మళ్లీ వచ్చేస్తోంది. వాటిని పండించే రైతులను(Farmers) ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలోని పూసాలో జరిగిన మిల్లెట్స్ (చిరుధాన్యాల, శ్రీ అన్న) సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. ప్రపంచ మేలు కోసం చిరు ధాన్యాల ఉత్పత్తులు పెరగాలని రైతులకు పిలుపు నిచ్చారు. భారతదేశపు మిల్లెట్ మిషన్ 2.5 కోట్ల మంది సన్నకారు రైతులకు వరంగా మారుతుందని మోడీ ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చిరు ధాన్యాలు పండించే రైతుల అవసరాలపై శ్రద్ధ చూపడం ఇదే ప్రధమం. ఆ విషయాన్ని మోడీ గుర్తు చేస్తూ రాబోవు రోజుల్లో చిరుధాన్యాలకు భారత్ ప్రపంచ కేంద్రం కావాలని అన్నారు.
చిరు ధాన్యాల యుగం (Modi Millet)
ప్రస్తుతం చిరు ధాన్యాలను(Modi Millet) 13 రాష్ట్రాల రైతులు పండిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో, ప్రతి వ్యక్తి గృహ వినియోగం నెలకు 2-3 కిలోల ఉండేది. ఇప్పుడు నెలకు 14 కిలోలకు వరకు పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. చిరు ధాన్యాలను న్యూట్రి-తృణధాన్యాలు అని కూడా పిలుస్తారని మోడీ అన్నారు. జాతీయ ఆహార ఉత్పత్తిలో చిరుధాన్యాల వాట 5-6 శాతం మాత్రమే ఉంది. ఆ వాటాను పెంచడానికి భారతదేశ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు వేగంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాలను (Farmers)నిర్దేశించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
Also Read : PM Narendra Modi: మోదీని అధికారం నుంచి దించాలని చూస్తున్న ఇంగ్లండ్, అమెరికా..!
ప్రపంచ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, ప్రపంచ మేలు కోసం గ్లోబల్ మిల్లెట్స్ (Modi Millet)సదస్సులు నిర్వహించడం ద్వారా భారత్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రపంచం ‘అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్’ని జరుపుకుంటున్నప్పుడు, భారతదేశం ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు.
Also Read : Millets: మిల్లెట్స్ ఖావో.. హెల్త్ బచావో..!
ఐక్యరాజ్యసమితి 2023ని ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’గా ప్రకటించడం వెనుక భారత దేశం ప్రయత్నం ఉందని గుర్తు చేశారు. ఇది దేశానికి గొప్ప గౌరవమని కొనియాడారు. భారతదేశంలోని 75 లక్షల మందికి పైగా రైతులు(Farmers) ఈ వేడుక వాస్తవంగా మాతో ఉన్నాయని ఫీల్ అవుతున్నట్టు వెల్లడించారు. గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 అధికారిక నాణేలను ఆవిష్కరించారు.
అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023
ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (Modi Millet)సంవత్సరంగా ప్రకటించడం వల్ల దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా ‘శ్రీ అన్న’ కోసం డిమాండ్ పెరిగిందని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చిరు ధాన్యాల ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వస్తోన్న షుగర్ ,బీపీ రోగాలకు విరుగుడుగా మిల్లెట్స్ ను ఆయుర్వేద డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాదు, సర్వరోగ నివారణిగా మిల్లెట్స్ ను కొందరు ఔత్సాహికులు సదస్సుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఆరోగ్యంపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతోంది. చిరు ధాన్యాల వాడకం కూడా పెరిగింది. అందుకు తగిన విధంగా ఉత్పత్తిని పెంచడానికి మోడీ పిలుపు నిచ్చారు.
Also Read : Unlimited Food: రూ.60కి తిన్నంత ఆహారం. వేస్ట్ చేసారో జరిమానా తప్పదు!

Related News

CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం
ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు.